కప్పు కాఫీ ధర రూ. 637 !
1 min readపల్లెవెలుగువెబ్: ప్రపంచ వ్యాప్తంగా కాఫీకి ఓ ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. కాఫీ రుచి తగలనిదే కొందరికి రోజు మొదలవ్వదు. ఇక భారత దేశంలో కాఫీకి ప్రత్యేక డిమాండ్ ఉంటుంది. రోజుకు కప్పుల కప్పుల కాఫీలు తాగేస్తారు చాలామంది. అసలు కాఫీ తాగకపోత ఏదో మిస్ అయ్యాం అనే ఫీలింగ్ ఉంటుంది చాలామంది.. అందుకు ఎక్కడైనా కాఫీకి ప్రత్యేక డిమాండ్ ఉంటుంది. విశాఖ జిల్లాలోని అరకులో పండే కాఫీ ఆకులకు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ మంచి డిమాండ్ ఉంటోంది. మన కాఫీ బ్రాండ్‌ను అరకు కాఫీ విదేశీ మార్కెట్‌లో మరింత సుస్థిరం చేస్తోంది. కప్పు కాఫీ అంటే ధర ఉంటుంది.. 25 రూపాయలు, పెద్ద రెస్టారెంట్లు.. ఏమైనా వెరైటీలు ఉంటే వంద వరకు ఉంటుంది ఏమో.. కానీ అక్కడ మాత్రం కప్పు కాఫీ 637 రూపాయలు..? ఏంటి నమ్మాలి అనిపించడం లేదు.. కానీ నిజం.. అంత ధర ఉన్నా.. ఏ మాత్రం లెక్క చేయకుంటా కప్పులు కప్పులు కాఫీ తగ్గేస్తున్నారు.