క్రమశిక్షణతో కలిగిన విద్యాభ్యాసాన్ని అభ్యసించాలి
1 min read– ఎంఈఓ గంగిరెడ్డి,
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : విద్యార్థులు క్రమశిక్షణతో కలిగిన విద్యాభ్యాసాన్ని అభ్యసించి బావి భారత పౌరులుగా ఎదగాలని మండల విద్యాశాఖ అధికారి గంగిరెడ్డి అన్నారు, బుధవారం మండల పరిషత్ పాఠశాల (తూర్పు హరిజనవాడలో) విద్యా కమిటీ సమావేశంలో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులతో ఆయన మాట్లాడుతూ, గతంలో కన్నా ఇప్పుడు విద్యావ్యవస్థ ఒక మహోన్నత స్థితిలో ఉందని నాడు నేడు ద్వారా ప్రభుత్వం, ప్రభుత్వ పాఠశాలలను, ప్రైవేట్ పాఠశాలల కన్నా ఎక్కువగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు, అంతేకాకుండా విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్, షూస్, నోట్ బుక్స్, పాఠ్యపుస్తకాలు తో పాటు ట్యాబులు మెరుగైన నాణ్యమైన భోజన సౌకర్యాన్ని కూడా అందించడం జరుగుతుందన్నారు, అలాగే పాఠశాలకు వచ్చే ప్రతి విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతా లో 15వేల రూపాయలు జమ చేయడం జరుగుతుందని తెలిపారు, కాబట్టి విద్యార్థులు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మరింత ఉన్నత చదువులు చదివి మీ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని ఆయన తెలియజేశారు, అనంతరం విద్యార్థులకు సంబంధించిన ప్రోగ్రెస్ కార్డులు, పరీక్ష ఫలితాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు మునెమ్మ, విద్యా కమిటీ చైర్మన్ రాజేశ్వరి, కమిటీ సభ్యులు, విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.