NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబం

1 min read

– లక్ష రూపాయల మేర నష్టం
పల్లెవెలుగు వెబ్ గడివేముల: మండల పరిధిలోని పెసరవాయి గ్రామంలో బుధవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో గ్రామానికి చెందిన మూల వెంకటయ్య కుమారుడు మూల ఇసాక్ కు చెందిన బరగొడ్ల కొట్టం,ఇంటి ముందరి వార పాక కాలిపోయి లక్ష రూపాయల ఆస్తి నష్టం జరిగినట్టు బాధితుడు వాపోయాడు.వెంటనే స్థానికులు అప్రమత్తమై మంటలను ఆర్పడంతో భారీ ఆస్తి నష్టం జరగలేదని.బాధితుడు మూల ఇసాక్ మాట్లాడుతూ గురువారం వేకువ జామున 3 గంటల సమయం లో ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా బరగొడ్ల కొట్టంలో మంటలు వ్యాపించగా అందులో నిల్వ ఉంచిన నల్ల పైపులు 50,తెల్ల పైపులు 10 ,వాన పట్టలు 2 ఇంకా వ్యవసాయ సామగ్రి,ఇంటి ముందు వార పాక,మొత్తం అగ్నికి ఆహుతి అయ్యాయని, దాదాపు లక్ష రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు భాదితుడు తెలిపారు.తమను ప్రభుత్వం ఆదుకోవాలని తమకు సహాయం చేయాలని కోరారు. గ్రామ వైసిపి నాయకుడు ఎల్లారెడ్డి,గ్రామ సర్పంచ్ ఎర్ర గుడి శేఖర్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు.

About Author