సమస్యల పోరాటయోధుడు మత్తుమ్ మొత్తం మొహిద్దిన్
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమించిన పోరాటయోధుడు మత్తుమ్ మొహిద్దిన్ అని ఎస్ టి యు స్టేట్ కౌన్సిలర్ కుంపటి సత్యనారాయణ అన్నారు. మంగళవారం పత్తికొండ స్థానిక యస్. టీ. యు. ప్రాంతీయ కార్యాలయంలో రాష్ట్రోపాద్యాయ సంఘం రూపకర్త ,వ్యవస్థాపకులు ,శాసన సభ,శాసన మండలి సభ్యులు, ప్రగతిశీల భావాలతో పండితుల పక్షాన కలమెత్తి నమ్మినసిద్ధాంతానికి జీవితాన్ని అంకితం చేసిన గొప్ప పోరాట యోధుడు” మక్తుం మొహిద్దీన్ “117 వ జయంతి యస్. టి. యు.మండల అధ్యక్షుడు చంద్ర శేఖర్ అధ్యక్షతన మక్తుమ్మొహిద్దీన్ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. .ఈ సందర్భంగా యస్. టి. యు.స్టేట్ కౌన్సిలర్ సత్య నారాయణ మాట్లాడుతూ, నిజాం నిరంకుశ పాలనలో విద్యా ఉపాద్యాయుల దుర్భర పరిస్థితులను , నిస్సహాయతలను గ్రహించి,ఆగ్రహించి ఉపాద్యాయుల బానిస సంకెళ్ళ విముక్తికోసం స్వతంత్ర ఉపాద్యాయ సంఘం( STU) ను తన స్వగృహంలో 1946 మే 17 న ఏర్పాటు చేసిన మహనీయుడనీ ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్థిక కార్యదర్శి రామమోహన్ రెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి బలరాముడు, మండల ఉపాధ్యక్షుడు మండ్ల వెంకటేశ్వర్లు,మండల నాయకులు ఇక్బాల్ హుస్సేన్,కిరణ్ కుమార్,తిప్పన్న తదితరులు పాల్గొన్నారు.