ఒక చేప ఖరీదు రూ. 3 లక్షలు !
1 min readపల్లెవెలుగువెబ్ : ఔషధ, పోషకాలతో కూడిన క్రోకర్ చేప ఒడిషాలోని భద్రక్ జిల్లాలో మత్స్యకారుల వలకు చిక్కింది. ధామ్రా నదీ సంగమ తీరంలో శుక్రవారం మత్స్యకారుడు హఫీజ్ ఉల్లా వేసిన వలలో 32కిలోలు ఉన్న ఈ భారీ జలపుష్పం లభ్యమైంది. దీనిని చాంద్‌బాలి చాందినిపాల్ చేపల వేలం కేంద్రంలో వేలం వేయగా, ముంబైకి చెందిన ఔషధాల కంపెనీ రూ.3 లక్షల 10 వేలకు దక్కించుకుంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో లభించే ఈ చేప భద్రక్ ధామ్రా తీరంలో చిక్కడం విశేషం. దీనిని ఘోల్ చేప కూడా అంటారు. స్థానిక భాషలో తెలియా అని వ్యవహరిస్తారు. ఈ చేపలను ఎక్కువగా సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, హాంగ్‌కాంగ్, జపాన్ దేశాల వారు దిగమతి చేసుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు.