సుంకేసులకు పోటెత్తుతున్న వరద
1 min readపల్లెవెలుగువెబ్: ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురస్తుండటంతో తుంగభద్రతో పాటు వేదవతి, హంద్రీ, కుందు, నదులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువన కర్ణాటక ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలకు కర్నూలు జిల్లాలోని సుంకేసుల జలాశయానికి వరద పోటేత్తుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 1.20 టీఎంసీ కాగా ఇన్‌ఫ్లో 22,882 క్యూసెక్కులు వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు 5 క్రస్ట్ గేట్లు అడుగు మేర తెరిచి 21,035 క్యూసెక్కులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గడిచిన 10 సంవత్సరాలో ఇదే రికార్డు స్థాయిలో 4 నెలల పాటు జలాశంలోకి భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది.