రెపరెపలాడిన మువ్వన్నెల జెండా
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76 వ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా ఆజాధికా అమృత్ మహోత్సవాల్లో భాగంగా మంగళ వారం మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల లలో అధికారులు, ప్రజా ప్రతినిధులు జాతీయ జెండాను ఎగురవేసి జనగణమన, వందేమాతరం గీతాలను ఆలపించి జాతీయ జెండా కు గౌరవ వందనం చేశారు , చెన్నూరు పంచాయతీ కార్యాలయంలో ఆగస్టు 15 పురస్కరించుకొని సర్పంచ్ సర్పంచ్ సిద్ది వెంకటసుబ్బయ్య నేతృత్వంలో జాతీయ జెండాను ఎగరవేశారు, అదేవిధంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీ పి చీర్ల సురేష్ యాదవ్ జాతీయ జెండాను ఎగురవేశారు, అలాగే మండలంలోనిరాచినాయ పల్లెలో చెరువు గట్టు వద్ద సర్పంచ్ సొంట్టం నారాయణరెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేశారు, అదేవిధంగా చెన్నూరు పోలీస్ స్టేషన్, లో ఎస్సై శ్రీనివాసుల రెడ్డి, తాసిల్దార్ కార్యాలయం లోతహసీల్దార్, అలీ ఖాన్ జాతీయ జెండా ఎగురవేశారు.. అలాగే కొండపేట గ్రామపంచాయతీ కార్యాలయం నందు సర్పంచ్ తుంగ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగరవేశారు జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో పాఠశాల చైర్మన్ మిట్టా కేశవరెడ్డి , జాతీయ జెండాను ఎగురవేశారు, కొక్కరాయపల్లె ఎంపీ యూపీ పాఠశాల యందు జాతీయ జెండా ఎగురవేశారు, ఈ కార్యక్రమంలో , మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జియన్, భాస్కర్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ జి ఎన్ భాస్కర్ రెడ్డి, సొసైటీ అధ్యక్షులు అల్లి శ్రీరామమూర్తి ,ఎంపీటీసీ లు ముది రెడ్డి సుబ్బారెడ్డి, ఎర్ర సాని నిరంజన్ రెడ్డి, నాగిరెడ్డి, పి, చంద్రశేఖర్, సాదిక్ అలీ, కార్యదర్శి రామసుబ్బారెడ్డి అధికారులు , ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.