నాలుగేళ్ల చిన్నారి పై అత్యాచారం కలచి వేసింది
1 min read
పల్లెవెలుగువెబ్ : హైదరాబాద్ డీఏవీ స్కూల్లో ఓ చిన్నారిపై అత్యాచారం జరగడం సంచలనం సృష్టించింది. స్కూలు ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ రజనీకుమార్ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు భగ్గుమన్నారు. ప్రిన్సిపాల్ నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా గర్హించారు. తాజాగా ఈ ఘటనపై టాలీవుడ్ అగ్రనటుడు చిరంజీవి స్పందించారు. నాలుగేళ్ల పసిబిడ్డపై స్కూల్ లో జరిగిన అత్యాచారం, అఘాయిత్యం తనను బాగా కలచివేసినట్టు వెల్లడించారు. అటవిక సంస్కృతి నుంచి ఆనవాళ్లు మోసుకొస్తున్న కొందరు మృగాళ్ల వికృత చేష్టలకు కఠినాతి కఠినమైన శిక్షలు వేగవంతంగా విధించాలని చిరంజీవి పేర్కొన్నారు.