జాబ్ ఇప్పిస్తామని తీసుకెళ్లి హింసిస్తున్న ముఠా !
1 min readపల్లెవెలుగువెబ్: విదేశాల్లో ఐటీ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆకర్షించే ముఠాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని భారత ఐటీ నిపుణులను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. మన దేశంలోని ఐటీ నైపుణ్యం ఉన్న యువతను నకిలీ జాబ్ రాకెట్లు లక్ష్యంగా చేసుకుంటున్నాయని తెలిపింది. ఈ నకిలీ ఐటీ సంస్థలు థాయ్‌లాండ్‌లో మంచి ఉద్యోగాలు ఉన్నాయంటూ యువతకు వల వేస్తున్నాయని చెప్పింది. బ్యాంకాక్, మయన్మార్ నుంచి ఈ విషయమై పలు ఫిర్యాదులు అందాయని వెల్లడించింది. కాల్ సెంటర్ కుంభకోణం, క్రిప్టోకరెన్సీ మోసాలకు పాల్పడిన ఐటీ సంస్థలు ఇప్పుడు రూటు మార్చాయని.. థాయ్‌లాండ్‌లో ‘డిజిటల్ సేల్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్’ ఉద్యోగాలు ఉన్నాయంటూ భారతీయ యువకులను ప్రలోభపెడుతున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.