చేనేతలకు స్వర్ణయుగం..
1 min read
నేతన్నలకు 365 రోజులు పని కల్పించాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యం
రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత అండ్ జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత
ఎమ్మిగనూరు , న్యూస్ నేడు: ఎమ్మిగనూరు మండల పరిధిలో బనవసి ఫారం దగ్గర మన ప్రభుత్వంలో చేనేతలకు స్వర్ణయుగం వచ్చిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత అండ్ జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు.మే ఒకటవ తేదీన నెల్లూరు జిల్లాలో 175 నియోజకవర్గాలకు ఒకటి చొప్పున 175 ఎమ్మెస్ ఎం ఇ. పార్కులకు వర్చువల్ గా భూమి పూజ నిర్వహించిన సందర్భంగా ఎమ్మిగనూరు నియోజకవర్గానికి సంబంధించి మంగళవారం ఎమ్మిగనూరు మండలం బనవాసి లో ఎంఎస్ఎంఈ పార్కు నిర్మాణానికి రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్, రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత & జౌళి శాఖ మంత్రి సవిత, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి, చేనేత & జౌళి శాఖ కమిషనర్ రేఖా రాణి, జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా భూమి పూజ నిర్వహించారు..ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేనేతల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారన్నారు. గత ప్రభుత్వం చేనేతలకు ఎటువంటి మేలు చేకూర్చలేదన్నారు… మంగళగిరిలో చేనేతలు పడుతున్న ఇబ్బందులు దగ్గరుండి చూసినందువల్ల తాను చేనేత జౌళి శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తనని పిలిచి చేనేతలను బాగా చూసుకోవాలని చెప్పారన్నారు.మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం పవర్ లూమ్ కి 500 యూనిట్లు, హ్యాండ్లూమ్ కి 200 యూనిట్లు ఉచిత కరెంట్ అమలు పరుస్తున్నామన్నారు… అంతే కాకుండా క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి నెల ఒక్కొక్క చోట ఎగ్జిబిషన్ లను ఏర్పాటు చేసి వారికి సౌకర్యంగా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేసి వారికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తున్నామన్నారు….ముఖ్యమంత్రి చేసిన కృషి వల్ల రాష్ట్రానికి చాలా క్లస్టర్లు మంజూరు చేసి రూ.348 కోట్లు కేటాయించారన్నారు..చేనేతలకు లేటెస్ట్ డిజైన్ల శిక్షణ ఇచ్చేందుకు గాను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లను ఏర్పాటు చేయబోతున్నామని, ఎమ్మిగనూరు లో కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు..ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చేసిన కృషి వల్ల టెక్స్టైల్ పార్కు సాధ్యమయిందన్నారు. ఎంఎస్ఎంఈ పార్కు లో మొదటి దశలో 22 ఎకరాల్లో మూడు నెలల్లో మౌలిక సదుపాయాలు పూర్తి చేస్తామన్నారు.. మిగిలిన 50 ఎకరాలలో టెక్స్టైల్ రిలేటెడ్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు…పారిశ్రామిక వాడకు ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను కూడా ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఎమ్మిగనూరు బ్రాండ్ వస్త్రాలకు మా సహకారం ఉంటుందని తెలిపారు. రిలయన్స్ కంపెనీ వారు కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారని మంత్రి తెలిపారు.రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేనేత లను ఆర్థికంగా బలపరచాలనే ఉద్దేశంతో ఇలాంటి పార్కు లను ఏర్పాటు చేశారన్నారు… ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు.చేనేత & జౌళి శాఖ కమిషనర్ రేఖా రాణి మాట్లాడుతూ టెక్స్టైల్ పార్క్ ను మొదటి ఫేస్ లో అభివృద్ది చేయడానికి ఏపీఐఐసీ నుంచి రోడ్లు, నీటి సదుపాయాలు కల్పించేందుకు 6.9 కోట్లు నిధులు కేటాయింపు చేశారన్నారు.. ఈ 77 ఎకరాలు పార్కులో 22 ఎకరాలు చిన్న చిన్న ప్లాట్లుగా మగ్గాలు పెట్టుకోవడానికి, మిగిలిన భూమి వస్త్ర పరిశ్రమ ఏర్పాటు చేసుకోవడానికి కేటాయించుకోవడం జరిగిందని కమిషనర్ తెలిపారు.వీవర్స్ కి ఐడెంటిటీ కార్డు ఇప్పించడం జరుగుతుందని, దీని వలన ముద్ర లోన్ వస్తుందని , కరెంటు ఫ్రీగా లభిస్తుందని తెలిపారు. ఇక్కడ కేటాయించిన ప్రదేశంలో షెడ్ లాగా కట్టుకొని, క్యాంటీన్ పెట్టుకొని, డిజైన్స్ స్టూడియో పెట్టుకన్నట్లైతే 365 రోజులు పని ఉంటుందని తెలిపారు. మన మార్కెటింగ్ మనమే చేసుకుని లాభపడవచ్చునని తెలిపారు.