NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముస్లిమ్ సోదరుల అభివృద్ధికి, సంక్షేమానికి కట్టుబడి ఉన్న ప్రభుత్వం

1 min read

ప్రజ‌లంద‌రూ సుఖ సంతోషాలతో ఉండాలి

రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి టీజీ భరత్

కర్నూలు నగరంలో రంజాన్ ప్రార్థనలో పాల్గొన్న మంత్రి టీజీ భరత్,జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

కర్నూలు, న్యూస్​ నేడు: ముస్లిమ్ సోదరుల అభివృద్ధికి, సంక్షేమానికి  ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు.సోమవారం రంజాన్ పండుగ సందర్బంగా నగరం లోని పాత ఈద్గాలో జిల్లా కలెక్టర్, ముస్లిం సోదరులతో కలిసి  మంత్రి టీజీ భరత్ ప్రార్థనలు చేశారు..అనంతరం మంత్రి, కలెక్టర్  ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.  ఈ సందర్భంగా  మంత్రి మాట్లాడుతూ ముస్లిం సోదరులందరూ  ఎంతో పవిత్రతతో, భక్తిశ్రద్ధలతో, ఆనందంగా జరుపుకుంటున్న పండుగ రంజాన్ అని పేర్కొన్నారు. వ‌ర్షాలు బాగా కురిసి, ప్రజ‌లంద‌రూ సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రజ‌ల‌కు ఎలాంటి స‌మ‌స్యలు లేకుండా ఉండేలా దీవించాల‌ని అల్లాహ్ ను ప్రార్థించానని మంత్రి తెలిపారు..నిన్న ఉగాది, నేడు రంజాన్ పండుగ‌లు రావ‌డం సంతోషం అని,   క‌ర్నూలు న‌గ‌రంలో  కుల‌,మ‌తాల‌కు అతీతంగా అందరూ అన్ని పండుగలను జ‌రుపుకోవ‌డం ఆన‌వాయితీ అని మంత్రి పేర్కొన్నారు.. ఇలా  హిందూ, ముస్లిం భాయీ భాయీ నినాదానికి ప్రతీక కర్నూలు నగరం అని మంత్రి పేర్కొన్నారు.

త్యాగానికి ప్రతీక రంజాన్: జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

త్యాగానికి ప్రతీక రంజాన్ అని, రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు క్రమశిక్షణ, ధార్మిక చింతన, నియమనిష్టలతో  నెలరోజుల పాటు కఠోర ఉపవాస దీక్షతో  అల్లాహ్ ను ఆరాధిస్తూ ఆధ్యాత్మిక జీవనం కొనసాగిస్తారనిజిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పేర్కొన్నారు.. ఈరోజు రంజాన్ పండుగ జరుపుకుంటున్న సందర్భంగా  జిల్లా ప్రజలందరికీ  కలెక్టర్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

About Author