జనాభా ఉన్న పాలన సున్నా.. గడివేములలో పడకేసిన సమస్యలు..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: దాదాపు ఆరు వేల పైచిలుకు జనాభా ఉన్న గడివేములలో పూర్తిస్థాయి పంచాయతీ కార్యదర్శి కార్యకలాపాలు మాత్రం ప్రజలకు అందడం లేదు గత రెండు సంవత్సరాల నుండి ఉన్న పంచాయతీ కార్యదర్శి తరచూ సెలవులు పెట్టడం వ్యక్తిగత సమస్యలతో సతమతం అవుతుండడంతో మండల కేంద్రంలో ఏ సమస్య ఉన్న ఎవరికి చెప్పుకోవాలో తెలియక మండల వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సరైన రహదారి మెరుగైన పారిశుధ్యం డ్రైనేజీ సమస్య తాగునీటి సరఫరాకు మూడు రోజులకు ఒకసారి ఆటంకం వర్షాలు పడితే మాత్రం రోడ్లు చెరువులను తలపిస్తాయి బీసీ కాలనీలో ప్రజల అవస్థలు అంత ఇంత కాదు ఇంత జరుగుతున్న మండల కేంద్రంలో పాలన చేస్తున్న ఎంపీడీవో ఈ ఓ ఆర్ డీ సమస్యల కంటే సమావేశాలకు ప్రాధాన్యత ఇవ్వడంతో క్షేత్రస్థాయి పర్యటనలు అంటూ సమయపాలన పాటించకపోవడం రోజు షరామాములు అయిపోయింది వ్యక్తిగత కారణాల మీద ఈనెల ఆరో తేదీ నుండి పంచాయతీ కార్యదర్శి సెలవుల్లో ఉండడంతో తాత్కాలికంగా ఇంకో కార్యదర్శిని ఇన్చార్జిగా నియమించే బదులు తూ తూ మంత్రంగా గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న అదయ్య ను ఈనెల 15 నుంచి ఇంచార్జి పంచాయతీ కార్యదర్శి గా నియమించారు.