PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలోఆంధ్ర రాష్ట్ర అవతరణకై అసువులు బాసిన రాష్ట్రపిత అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు గురువారం బనగానపల్లె పట్టణంలో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా శ్రీ పొట్టిశ్రీరాముల చిత్రయటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పట్టణ ఆర్యవైశ్య సంఘము అధ్యక్షుడు శివ చంద్రయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పట్టణంలోనిఆర్యవైశ్యసంఘంప్రముఖులు,మహిళలు బండారు లలిత, సుబ్బ సత్యనారాయణ, శ్రీరామ సుబ్రమణ్యం, సత్యమయ్య, డి వెంకటసుబ్బయ్య, టంగుటూరి శీనయ్య, నూకల విజయకుమార్, గుండా శ్రీనివాసులు, గుండా రవికుమార్, రామకృష్ణ, బచ్చు మధుసూదన్, బచ్చు శరత్ చంద్ర జంగంశెట్టిలు తదితరులు పాల్గొన్నారు.

About Author