జూనియర్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు సభ
1 min read– లక్ష రూపాయలు విరాళాన్ని అందజేసిన లెక్చరర్ ఆనంద్
– మంచిగా చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలి జడ్పిటిసి
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ కనబరిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని అంతేకాకుండా మీరు అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవచ్చని ఇదంతా కూడా మీ చేతుల్లోనే మీ భవిష్యత్తు ఉందని మిడుతూరు మండల జడ్పిటిసి పర్వత యుగంధర్ రెడ్డి అన్నారు.స్థానిక మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సర విద్యార్థులకు వీడ్కోలు సభ కార్యక్రమాన్ని ఇంటర్ మొదటి సంవత్సర విద్యార్థిని విద్యార్థులు మరియు కళాశాల అధ్యాపకులు నిర్వహించారు.ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పిటిసి పర్వత యుగంధర్ రెడ్డి,కళాశాల కమిటీ చైర్మన్ బన్నూరు నాగిరెడ్డి మరియు గ్రామ సర్పంచ్ విద్యాపోగుల జయ లక్ష్మమ్మ హాజరయ్యారు.ఈ సందర్భంగా విద్యార్థులు కళాశాలలో అధ్యాపకులు చెప్పినటువంటి మాటలను గ్రహించుకుని ఇలాంటి చెడు అలవాట్లకు గురికాకుండా మంచిగా చదువుకుంటూ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలని పలువురు విద్యార్థులకు అతిధులు హితబోధ చేశారు. అంతేకాకుండా మీరు మంచిగా చదువుకొని ఒక స్థానంలో ఉంటే అటు తల్లిదండ్రులకు ఇటు కళాశాలకు మంచి పేరు తీసుకు వచ్చిన వారవుతారని వారు అన్నారు.ఇదే కళాశాలలో కెమిస్ట్రీ అధ్యాపకులుగా పనిచేస్తున్న ఆనంద్ విద్యార్థుల దృష్టిని ఉంచుకొని కళాశాల అభివృద్ధికి తానై సొంతంగా కళాశాల అభివృద్ధిలో ఆయన పాలు పంచుకున్నారు. కళాశాలలో తరగతి గదుల షెడ్లు పడిపోయే స్థితిలో ఉండగా వాటి మరమ్మతుల కొరకు గాను తన వంతుగా కళాశాల అధ్యాపకులు ఆనందు లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు.తర్వాత భోజన కార్యక్రమం అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చాలా ఆనందాన్ని కలిగించాయి.అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ బి.శంకర్ నాయక్ మరియు అధ్యాపకులు ముఖ్య అతిధులను శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు.ఈకార్యక్రమంలో ఉపసర్పంచ్ తువ్వా లోకేశ్వర్ రెడ్డి,జిల్లా పరిషత్ పాఠశాల హెచ్ఎం శివజ్యోతి,కళాశాల అధ్యాపకులు ఎం.ప్రభాకర్,రమాదేవి,శ్రీకాంత్,తిరుమలేశ్వర్ రెడ్డి,ఆనంద్,సీతారామరాజు మరియు ఇంటర్ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.