దోసపాడులో ఘనంగా గంగానమ్మ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం
1 min readఅమ్మవారిని దర్శించుకున్న ఐఎఫ్ టియు నగర అధ్యక్షులు కాకర్ల శీను, కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : దెందులూరు నియోజకవర్గ మండలం దోసపాడు గ్రామంలో గ్రామస్తులు ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన గంగానమ్మ తల్లి ఆలయంలో గ్రామ దేవత గంగానమ్మ తల్లి విగ్రహా ప్రతిష్టా మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామస్తులు అమ్మవారికి పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు చేసి అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారిని ఆంధ్ర ప్రదేశ్ ప్రగతిశీల భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంఘం (ఐఎఫ్ టియు) ఏలూరు టౌన్ అధ్యక్షులు కాకర్ల శ్రీను, బాలాజీ కన్సల్టెన్సీ ఇంజనీర్స్ అధినేత సివిల్ ఇంజనీర్ పదిలం శ్రీనివాసరావు, సివిల్ కాంట్రాక్టర్ పాకలపాటి బ్రహ్మాజీ, ఐఎఫ్ టియు కమిటీ సభ్యులు మర్రి అప్పారావు లతో పాటు పలువురు ప్రముఖులు గ్రామస్తులు గంగానమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో వందలాదిమంది భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు, భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అందుకుని మొక్కులు తీర్చుకున్నారు.