NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జిల్లా టాపర్ కు.. ఘన సన్మానం…

1 min read

నిర్మల ను అభినందించిన  జే సీ బి. నవ్య

ఆదోని, న్యూస్​ నేడు: ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలలో కర్నూలు జిల్లా టాపర్‌గా నిలిచిన పెద్ద హరివనం గ్రామానికి చెందిన ఎస్. నిర్మలను మంగళవారం ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ బి. నవ్య , ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ , రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప, పాల్గొని, నిర్మలకు శాలువ కప్పి, పులవేసి సత్కరించారు. కేజీబీవీ కళాశాల, ఆస్పరి మండలం లో బైపీసీ విభాగంలో చదువుతున్న నిర్మల, మొదటి సంవత్సరం 421 మార్కులు, రెండో సంవత్సరం 966/1000 మార్కులు సాధించి, జిల్లాలో బైపీసీ విభాగంలో అత్యుత్తమ స్థాయిలో ప్రదర్శన చూపారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సమర్థంగా వినియోగించుకుని, నిర్మల వంటి విద్యార్థులు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరాలి, అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్మలా మాట్లాడుతూ.. ఐపీఎస్ కావడమే తన లక్ష్యమని వెల్లడించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *