PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైభవంగా పల్లకి మహోత్సవం

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : మండలం లో యాగంటి, శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం నందు నేడు సోమవారం సందర్భముగా వైభవంగా పల్లకిమహోత్సవంనిర్వహించబడినది. ప్రదోషకాల ప్రత్యేక పూజల అనంతరం స్వామిఅమ్మవార్లను పల్లకి నందు నంది మంటపము నందు వేంచేపు చేసి పూజల అనంతరం ఆలయము నందు పల్లకి ఉత్సవం నిర్వహించబడినది. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేయడం జరిగినది. కార్యక్రమము నందు అలయాధికారి చంద్రశేఖర్ రెడ్డి, చైర్మన్ బుచ్చిరెడ్డి, పాతపాడు సర్పంచ్ మహేష్ రెడ్డి, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

About Author