ఘనంగా దేవాలయ ప్రతిష్టాపన కార్యక్రమం
1 min read– ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏలూరు పిఠాధిపతులు బిషప్ జయరావు పొలిమేర
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : స్థానిక మాదేపల్లి గ్రామంలో పునీత అన్నమ్మగారి దేవాలయ ప్రతిష్టోత్సవ మహోత్సవము ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఏలూరు పీఠాధిపతులు జయ రావు పొలిమేర దివ్య హస్తాల ఆశీస్సులతో మరియు వివిధ దేవాలయాల విచారణ గురువులు మధ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. పూజ్యగురుశ్రీ జోసెఫ్ తోట 20వ వసంత గురుత్వ జీవిత ప్రయాణంలో దేవుని సువార్త వ్యాప్తిలో అలుపెరగని బాటసారిగా, పేదల పెన్నిధిగా నిస్సహాయుల సహాయకునిగా, స్వచ్ఛంద సేవ మూర్తిగా, మీ ప్రయాణం అలుపెరగనిది వెనుదిరగనిది. మాదేపల్లి గ్రామం నందు సుందరమైన హంగులతో అతి గొప్ప ఆర్ సి ఎం దేవాలయం నిర్మించిన మహోన్నతమైన వ్యక్తిగా కొనియాడ బడుతున్నారు. 10 సంవత్సరములు జర్మనీ దేశంలో సేవ చేస్తున్న , దేవుడు మిమ్ములను తన యాజకాభిషేక వరలతో నూరంతలుగా ఫలింపజేయాలని ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు, ఫాదర్ అంతోని రాజు తోట మాదేపల్లి ప్యారిస్ ఫ్రీస్ట్ విచారణ గురువుగా సేవలను అందిస్తున్న తరుణంలో ఇoతటి బృహత్తరమైన కార్యక్రమం జరగటం తోట వంశంలో ఫలించిన వంశ వృక్షాలకు గర్వకారణంగా ప్యారిస్ కౌన్సిల్, క్యాథలిక్స్ , టీచర్స్ పలువురు గ్రామస్తులు మరియు విచ్చేసిన అతిరథ మహారధులు కొనియాడుతున్నారు. దేవాలయం నిర్మించిన ఇంజనీర్ శేఖర్ కు దు శాలువా కప్పి పూలమాలలు వేసి ఆయన్ని ఘనంగా సన్మానించారు, జర్మనీ దేశాo నుంచి విచ్చేసిన పలువురుకి గౌరవ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పెద్ద ఎత్తున ప్రేమ విందు ఏర్పాటు చేశారు.