యువ స్పందన స్టడీ సర్కిర్ లో “వీర జవాన్ మురళి నాయక్” ఘన నివాళి!
1 min read
పత్తికొండ, న్యూస్ నేడు: భారత్ -పాక్ సరిహద్దుల్లో యుద్ధంలో అమరుడైన వీర జవాన్ మురళి నాయక్ కి పత్తికొండ యువ స్పందన సొసైటీ ఆధ్వర్యంలో సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. ఆదివారం సాయంత్రం పత్తికొండ పట్టణంలోని యువ స్పందన స్టడీ సర్కిల్ యందు యువ స్పందన సొసైటీ సభ్యులు మరియు నిరుద్యోగులు మురళీ నాయక్ చిత్రపటం ముందు క్రొవ్వొత్తులను వెలిగించి జోహార్ మురళి నాయక్…జోహార్ జోహార్… అమర్ రహే అంటూ నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. . ఈ సందర్భంగా యువ స్పందన సొసైటీ ఉపాధ్యక్షులు లక్ష్మన్న మాట్లాడుతూ…. పాకిస్తాన్ యుద్ధంతో దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళి నాయక్ సేవలు మరువలేనివని తెలిపారు. వీర జవాన్ మురళి నాయక్ కుటుంబానికి భగవంతుడి ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువ స్పందన సొసైటీ సెక్రటరీ నాగరాజు, సభ్యులు రాజేశ్వరి, ఖాజా, జయవీర, స్టడీ సర్కిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
