NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టిడిపి లీగల్ సెల్ రాష్ట్ర కమిటీ సెక్రటరీకి ఘన సన్మానం

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  పత్తికొండ ప్రాంత ప్రముఖ న్యాయవాది కలమడి సురేష్ కుమార్ ను స్థానిక బార్ అసోసియేషన్ మంగళవారం ఘనంగా సన్మానించింది. తెలుగుదేశం పార్టీ లీగల్సేల్ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా పత్తికొండ  జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో  బార్ అసోసియేషన్  మాజీ జనరల్ సెక్రటరీ న్యాయవాది నారాయణస్వామి ఆధ్వర్యంలో టిడిపి లీగల్ సెల్ రాష్ట్ర కమిటీ సెక్రటరీ కే.సురేష్ కుమార్ ను  సీనియర్, జూనియర్ న్యాయవాదులు శాలువా కప్పి పూలమాలలతో  ఘనంగా  సన్మానించారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు తిమ్మయ్య చౌదరి, సత్యనారాయణ, రమేష్ బాబు మాట్లాడుతూ… సీనియర్ న్యాయవాది సురేష్ కుమార్ తన న్యాయవాద వృత్తిని ఎంతో క్రమశిక్షణతో నిర్వహించారని, ఇతర న్యాయవాదులకు ఆదర్శనీయంగా న్యాయవాద వృత్తిని కొనసాగిస్తున్నారని కొనియాడారు. టిడిపి తరపున లీగల్ విభాగంలో ప్రతి విషయానికి తక్షణమే స్పందించి సమస్యలు పరిష్కరించేవాడని ఆయన  తెలిపారు. సురేష్ కుమార్ సేవలను గుర్తించిన  అధిష్టానం  నారా చంద్రబాబు నాయుడు  తెలుగుదేశంపార్టీ లీగల్ సెల్ రాష్ట్ర సెక్రటరీగా  ఎన్నుకోవడం గర్వకారణమని అన్నారు. సురేష్ కుమార్  భవిష్యత్తులో లీగల్ విభాగంలో ఎన్నో పదవులు చేపట్టాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో సీనియర్, జూనియర్ న్యాయవాదులు నాగభూషణంరెడ్డి, మధుబాబు, శ్రీకాంత్ రెడ్డి , జఠంగిరాజు, అరుణ్, వీరేష్, రవికుమార్, నాగరాజు, రాజా, హరి, సాంబ తదితరులు పాల్గొన్నారు.

About Author