PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉపాధ్యాయునికి ఘన సన్మానం …

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: ఎంపీపీ స్కూల్ తూర్పు హరిజనవాడ ఎంపీపీ స్కూల్ నందు అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అవార్డు గ్రహీత ఉపాధ్యాయులు పబ్బులేటి శ్రీనివాసులు కు పాఠశాల విద్యార్థులు , అలాగే గ్రామ ప్రజల సమక్షంలో గురువారం ఘనంగా సన్మానం చేయడం జరిగినది, ఈ సందర్భంగా తూర్పు హరిజన వాడ గ్రామ ప్రజలు మాట్లాడుతూ, ఉపాధ్యాయులు శ్రీనివాసులు తమ పిల్లలను సొంత బిడ్డల చూసుకుంటూ పిల్లలకు మంచి విద్యాబోధన తో పాటు క్రమశిక్షణ నేర్పించడం జరిగిందన్నారు, మంచి మనసున్న ఉపాధ్యాయ శ్రీనివాసులు సత్కరించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు, ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ సంఘంలో గౌరవ మర్యాదలు సంపాదించుకోవాలి చాలా కష్టపడాల్సి ఉంటుందని, అలాగే దానిని కాపాడుకోవడం కూడా ఎంతో అవసరమని ఈరోజు గ్రామ ప్రజలు తోటి ఉపాధ్యాయులు, నా విద్యార్థుల మధ్య ఈ సన్మానం జరగడం జీవితంలో నేనుమర్చిపోలేనని ఆయన భావోద్వేగంగా ప్రసంగించారు, ఈ కార్యక్రమంలో  కొండపేట ప్రధానోపాధ్యాయులు టి  రమణయ్య  మరియు స్కూల్ కమిటీ చైర్మన్  రాజేశ్వరి  మరియు సహోపాధ్యాయురాలు  మున్నెమ్మ , విద్యార్థులు గ్రామస్తులు పాల్గొన్నారు.

About Author