PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మండల ప్రభుత్వ వైద్యాధికారినికి ఘన సన్మానం..

1 min read

పల్లెవెలుగు, వెబ్ గడివేముల: గత రెండు సంవత్సరాల నుండి మండల ప్రభుత్వ వైద్యాధికారిగా సేవలందిస్తున్న సృజన తిరుపతిలో పీజీ కోర్సు చేయడానికి ఇక్కడి నుంచి వెళ్తున్న సందర్భంగా సోమవారం నాడు మండలంలోని వైద్య సిబ్బంది వివిధ శాఖల అధికారులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా కరోనా సమయంలో మండలంలో ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వచ్చిన రోగులకు మనోధైర్యం అందిస్తూ వైద్య సేవలు అందించి డాక్టర్ వృత్తికి వన్నెతెచ్చారని కొనియాడారు అనంతరం వైద్య సిబ్బంది శాలువా కప్పి పూలమాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ప్రభుత్వ వైద్యాధికారిని సృజన మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుండి మండల ప్రజలతో ప్రత్యేక అనుబంధం ఏర్పడిందని ఉన్నత చదువుల కోసం పీజీ వైద్య విద్య అభ్యసించడానికి వెళ్తున్నట్టు తనకు సహకరించిన ప్రజలకు వైద్య సిబ్బంది పాత్రికేయులకు మండల అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

About Author