పర్యావరణ పరిరక్షణకై కృషి చేస్తున్న వారికి ఘన సన్మానం..
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: పృధ్వీ దినోత్సవాన్ని పురస్కరించుకొని నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్, లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ మెల్విన్ జోన్స్ ల సంయుక్త ఆధ్వర్యంలో ఎస్ ఏపీ క్యాంపు లో ఉన్న కట్టమంచి రామలింగారెడ్డి మెమోరియల్ మున్సిపల్ హై స్కూలులో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కౌన్సిల్ ఆఫ్ ఆల్ ఇండియా ఆల్ ఇండియా జనరల్ సెక్రెటరీ, నైస్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ అధ్యక్షతన పర్యావరణ పరిరక్షణకై కృషి చేస్తున్న వారిని కర్నూల్ మునిసిపల్ కమిషనర్ రవీంద్రబాబు, బెటాలియన్ డిఎస్పి తదితరులు పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి వెంకటరెడ్డి తదితరులను ఘనంగా సన్మానించారు. అవార్డు గ్రహీతలలో రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ బి జయచంద్ర రెడ్డి కి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇన్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అవార్డు, ఎన్విరాన్మెంటల్ జస్టిస్ ఇన్ రీసైక్లింగ్ ఇన్నోవేషన్ అవార్డును తోట హరికృష్ణకు, గ్రీన్ ఇన్నోవేషన్ ఎక్సలెన్సీ అవార్డును ఎస్ రమేష్ గుప్తాకు, ఎక్సలెన్సీ అవార్డు ఇన్ అనిమల్ ప్రొటెక్షన్ అవార్డును మానస ప్రియా కు, యూత్ ఎన్విరాన్మెంటల్ లీడర్షిప్ ఎక్సలెన్సీ అవార్డు జి లోకేశ్వర్ రెడ్డి కి, ఎన్విరాన్మెంటల్ ఎక్సలెన్సీ ఇన్ ట్రీ ప్లాంటేషన్ అవార్డు జి హరి రామ కిషోర్ కి ,గ్రీన్ ఇన్నోవేషన్ ఎక్సలెన్సీ అవార్డు ఇన్ టెర్రస్ గార్డెనింగ్ అవార్డును పి అంజలి శివప్రసాద్ కి, ఎక్సలెన్సీ అవార్డు ఇన్ అగ్రికల్చర్ అవార్డును ఎం బాల భాస్కర శర్మ కి ,లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇన్ సోషల్ సర్వీసెస్ డాక్టర్ నాగ స్వామి నాయక్ కి, లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇన్ సోషల్ సర్వీస్ అవార్డు కే డీజే బాబు కి మరియు డాక్టర్ పి గంగన్న కి అందజేయడం జరిగింది.