NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉయ్యూరు సి డి సి చైర్మన్ కు ఘన సన్మానం 

1 min read

– ఉయ్యూరు   :  గ్రామీణ రైతాంగ కుటుంబానికి చెందిన వ్యక్తిగా

పల్లెవెలుగు వెబ్ ఉయ్యూరు:  రైతులకు మేలు చేసే రాజకీయ పదవులు లభించడం అత్యంత సంతోషకరమైన విషయమని ,ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్వల్లభనేని సత్యనారాయణ ( నాని )అన్నారు. ఉయ్యూరు సి డి సి చైర్మన్ గా ఇటీవల  నియమితులైన రాజులు పాటి రామచందర్రావు, కార్యాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఉయ్యూరు మున్సిపల్ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ సత్యనారాయణ ( నాని) మాట్లాడుతూ   గతంలో ఉయ్యూరు ఏఎంసీ చైర్మన్ గా రైతులకు సేవలందించిన, రాజులపాటి రామచంద్రరావు, అదేవిధంగా చెరకు రైతాంగానికి సేవలు అందించేలా చెరకు అభివృద్ధి మండలి చైర్మన్ గా నియమితులవడం విశేషమని అన్నారు . గ్రామీణ రైతాంగ కుటుంబానికి చెందిన వ్యక్తిగా రైతులకు ,మేలు చేసే రాజకీయ పదవులు లభించడం అత్యంత సంతోషకరమైన విషయం అని ఆయన అన్నారు.  ఈ కార్యక్రమంలో 16వ వార్డు కౌన్సిలర్ ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ,డాక్టర్ విభాగం రాష్ట్ర కార్యదర్శి ,జంపాన పూర్ణిమ, ఉయ్యూరు పట్టణ వైఎస్ఆర్సిపి అధ్యక్షులు, అబ్దుల్ కలాం నగర పంచాయతీ కోఆప్షన్ సభ్యులు ఎస్కే ఖలీల్ కలిసి రాజులపాటి రామచంద్ర రావు ను ఘనంగా శాలువాలతో సత్కరించి, పూల బొకేలతో, ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు .ఈ కార్యక్రమంలో ఉయ్యూరు 17వ వార్డు కౌన్సిలర్ రాజులపాటి నాగేంద్ర ప్రసాద్ (చిన్ని), సామాజిక కార్యకర్త జంపానశ్రీనివాస్ గౌడ్, వైఎస్ఆర్సిపి నాయకులు జగ రోతు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

About Author