PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా విజ్ఞానశాస్త్ర ప్రదర్శన

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ స్వర్ణలతాదేవి ఆధ్వర్యంలో, విజ్ఞాన శాస్త్ర ప్రదర్శనను(సైన్స్ పోస్టర్స్) ఫిజిక్స్ విభాగం వారు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ’ ఉన్నతమైన ఆశయాలతో సైన్స్ లో గొప్ప గొప్ప ఫలితాలను తీసుకొని రావాలని తెలియజేశారు.’ఫిజిక్స్ విభాగాధిపతి ఉమామహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ‘సైన్స్ అనేది అనంతమైనది ఎన్నో ఉన్నతమైన ప్రమాణాలతో ఎంతోమంది సైంటిస్టులు రీసెర్చ్ చేస్తున్నారు, కావున విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటున్నాను’ అనితెలియజేశారు.విద్యార్థులు వేసిన పెయింటింగులను అధ్యాపకులు, వివిధ భాగాల నుండి విచ్చేసిన విద్యార్థిని విద్యార్థులు తిలకించడమైనది.ఈ కార్యక్రమంలో డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి, డాక్టర్ సుధాకర్ రెడ్డి, డాక్టర్ రామకృష్ణ, శ్రీమతి కౌసల్య దేవి, నరేంద్ర నాథ్ రెడ్డి, నాగరాచారెడ్డి, నాగ తిమ్మయ్య, రవికుమార్, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

About Author