మిత్రుడికి ఆపన్న హస్తం….
1 min read
చిన్న నాటి మిత్రుడికి అండగా పూర్వ విద్యార్థులు….
హొళగుంద , న్యూస్ నేడు: తమతోపాటు కలిసి చదువుకున్న మిత్రుడు అనారోగ్యంతో భాదపడుతున్న విషయాన్ని తెలుసుకుని తోటి మిత్రులు రూ.41000 వేల ఆర్థిక సహాయాన్ని అందించి నీకు మేమున్నామన్న భరోసా కల్పించారు.హొళగుంద మండలం లోని మార్లమాడికి గ్రామానికి చెందిన రామాంజి క్యాన్సర్ వ్యాధి తో బాధపడుతున్న విషయం తెలుసుకున్న 2006 బ్యాచ్ మిత్రులు కలిసి ఇచ్చిన నగదును శుక్రవారం కర్నూల్ లోని అస్పత్రిలో పెద్దహ్యాట మల్లయ్య,చిన్న మల్లయ్య, తిమ్మారెడ్డి,సుధా,ద్యావన్న తో పాటు కలిసి రామాంజి కుటుంబ సభ్యులకు రూ.41000 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.మిత్రుని కుటుంబానికి 2006 పదవతరగతి పూర్వ విద్యార్థులు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. డాక్టర్ తో మాట్లాడి రామాంజి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు.మిత్రుడు త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు.