స్వర్ణఆంధ్ర-స్వచ్ఛఆంధ్ర.. పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన సమాజం
1 min read
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడోద్దు
స్వర్ణఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర లో పాల్గొన్నజిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఎమ్మెల్యే బడేటి చంటి, మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు
ప్రతి నెల మూడో శనివారం స్వర్ణాంధ్ర-స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించాలి
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన సమాజం నిర్మాణమౌతుందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి పేర్కొన్నారు. శనివారం ఏలూరు ఆర్.ఆర్. పేట లోని ఎన్.టి.ఆర్. పార్కు వద్ద నిర్వహించిన స్వర్ణఆంధ్ర – స్వచ్ఛఆంధ్ర కార్యక్రమం జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి, ఎమ్మెల్యే బడేటి రాధా కృష్ణయ్య(చంటి), మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు.. డిప్యూటీ మేయర్లు పప్పు ఉమామహేశ్వరరావు, వందనాల దుర్గాభవాని, ఆర్డిఓ అచ్యుత్ అంబరీష్, డిఆర్డిఏ పిడి ఆర్. విజయరాజు, సెట్ వెల్ సిఇఓ ప్రభాకరరావు, మునిసిపల్ కమిషనర్ ఏ .భానుప్రతాప్, కార్పొరేటర్లు సబ్బన శ్రీనివాసరావు, జున్నూరు కనక నరసింహరావు, పాము శ్యామ్యూల్, ఈదుపల్లి పవన్, పలువులు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎన్.టి.ఆర్. పార్కులో మొక్కలు నాటారు. అనంతరం మున్సిపల్ రిజర్వాయర్ ప్రహరీగోడకు పెయింటింగ్ వేశారు. అనంతరం జరిగిన సభలో ప్రతిజ్ఞ నిర్వహించి స్వచ్ఛత పరిశుభ్రతపై ప్రజల్లో చైతన్యం రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా ప్రతినెలా మూడవ శనివారం స్వర్ణఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. గౌ. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల పిలుపుమేరకు చిత్తశుద్ధితో అందరూ పరిశుభ్రత పాటించాలని ఇది ఆరోగ్యానికి చాలాముఖ్యమన్నారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల ముఖ్యంగా ఒకసారి వాడి పారవేసే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులవల్ల పర్యావరణం,పరిశుభ్రత దెబ్బతింటుందన్నారు. వంద మైక్రోన్ల కంటే తక్కువ ప్లాస్టిక్ బదులుగా క్లాత్, జూట్ వంటి పత్యామ్నాయ వంటి వస్తువులు ఉపయోగించాలన్నారు. ప్రజల ఆరోగ్యం కోసమే ఈ అవగాహన కల్పించడం జరుగుతుందని పెనాల్టీవేయడం కష్టమేమీ కాదని, మనలో మార్పురావాలని ఆమె స్పష్టం చేశారు. బయటికి వచ్చేటప్పుడు మనతోపాటు క్లాత్ చేతిసంచి ఉంచుకోవడం అలవాటుగా చేసుకోవాలన్నారు. విద్యార్ధులు కూడా తమ తల్లిదండ్రులకు సింగిల్ ప్లాస్టిక్ వాడకూడదనే విషయంపై అవగాహన పరచాలన్నారు. ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య(చంటి) మాట్లాడుతూ స్వర్ణాంధ్ర లక్ష్యసాధనలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. పర్యావరణ, పరిరక్షణకు అందరూ కృషిచేయాలన్నారు. ఇళ్లతోపాటు మన చుట్టూఉన్న పరిసరాలు, స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలు, ప్రార్ధనామందిరాలను పరిశుభ్రంగా ఉంచుకోవల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. కాలుష్యంతో దెబ్బతింటున్న పర్యావరణాన్ని పరిరక్షించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వాడవద్దని ఆయన హితవు పలికారు. నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు మట్లాడుతూ నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా రూపొందిద్దామని పిలుపునిచ్చిన పిలుపునిచ్చారు. ఏలూరు నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.