ఆరోగ్యకరమైన నేల లాభాలు పండించే పంట
1 min read– మట్టి నమూనా పరీక్షలు చేసుకుంటే రైతులకు మేలు. మండల వ్యవసాయ అధికారి హేమ సుందర్ రెడ్డి..
పల్లెవెలుగు వెబ్ గడివేముల: నేల ఆరోగ్యము మరియు మట్టినమూనాల సేకరణ పై శనివారం నాడు మండల స్థాయిలో మండల వ్యవసాయ అధికారి హేమసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఏ ఓ వ్యవసాయ సిబ్బందికి మట్టి నమూనాల సేకరణ పైన, నేలలు, పోషకాల ఆవశ్యకత, భూసార పరీక్షల ప్రాముఖ్యత, సమస్యత్మక నేలలు – బాగు చేయుట ,సమగ్ర సమతుల ఎరువుల యాజమాన్యం గురించి ఆర్బికే సిబ్బందికి అవగాహన కల్పించారు. మట్టి నమూనాలో కనుగొనబడే లక్షణాలు – నేల రంగు, స్వభావము, రకము , రుచి, ఉదజని సూచిక , లవణ శాతము , సేంద్రియ కర్బనము మరియు ముఖ్య పోషకా లైన నత్రజని ,భాస్వరం, పొటాషియం యొక్క లభ్యత . భూమిలో పోషకాల లభ్యత తక్కువ ఉన్నట్టయితే ,30% ఎరువులు అదనంగా పైపాటుగా అందించవలసి ఉంటుందని రైతు సోదరులందరూ కూడా ఆర్బికే సిబ్బందిని సంప్రదించి మట్టి నమూనాల తమ క్షేత్రంలలో సేకరించి పంపవలసిందిగా మండల వ్యవసాయ అధికారి తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది ఆర్పీకే సిబ్బంది పాల్గొన్నారు.