అయోధ్యలో బాల రాముని ప్రతిష్ట రోజున సెలవు ప్రకటించాలి.. ఆపస్ వినతి
1 min read
పల్లెవెలుగు వెబ్ విజయవాడ : నేడు విజయవాడ లోని ఎండోమెంట్ కార్యాలయం నందు గౌరవ ఎండోమెంట్ కమీషనర్ శ్రీ ఏ.సత్యనారాయణని ఆపస్ రాష్ట్ర అధ్యక్షులు యస్.బాలాజీ, సంఘటనా కార్యదర్శి సిహెచ్. శ్రావణ కుమార్, బి. రఘునాథ్, వి.మార్కండేయుులు కలిసి ఐచ్చిక సెలవుల్లో హిందువులకు 3పండుగలు మాత్రమే వచ్చాయని మరికొన్ని హిందూ పండుగలను ఆప్షనల్ హాలిడేస్ లిస్టులో శ్రీ పంచమి, నరక చతుర్దశి, శ్రావణ పౌర్ణమి తదితర హిందూ పండుగలను చేర్చాలని, ఈనెల 22న అయోధ్య శ్రీరామ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా సెలవు ఇవ్వాలని కోరగా వారుసానుకూలం గా స్పందించి, ప్రభుత్వానికి తెలియజేస్తాము అని తెలిపారు.