చిన్నారుల వైకల్యాల గుర్తింపు ఇంటింటి ప్రచార కార్యక్రమం
1 min read
పల్లెవెలుగు కర్నూలు: 0 నుంచి 6 సంవత్సరాల వయస్సు లోపు పిల్లలలో పుట్టుకతో వచ్చే లోపాలు, ఆలస్యంగా అభివృద్ధి చెందే సమస్యలు ,పోషక లోపాలు, మానసిక ఆరోగ్య సమస్యలను తొలి దశలోనే గుర్తించి తగిన వైద్య సేవలను అందించడానికి డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ ఉంటుందని లీగల్ సర్వీసెస్ టు పర్సన్స్ విత్ మెంటల్ ఇల్ నెస్ అండ్ పర్సన్స్ విత్ ఇంటలెక్చువల్ డిజేబులిటీ స్కీమ్ కమిటీ మెంబర్ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికారిక సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి బి .లీలా వెంకట శేషాద్రి ఆదేశాల మేరకు 0 నుంచి 6 సంవత్సరాల లోపు చిన్నారుల వైకల్యాల గుర్తింపు ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా సమస్యలు ఉండి వైద్యం అందని నిరక్షరాస్య ,నిరుపేద కుటుంబాల చిన్నారులు గుర్తింపు సర్వేను నేడు పెద్ద పడకానా, బండి మిట్ట, మంగలి గేరి, రామ్ బొట్ల దేవాలయ పరిసర ప్రాంతాలలో చిన్నారుల వైకల్యాల గుర్తింపు ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ డి .ఈ. ఐ .సి సెంటర్లు కేంద్ర ప్రభుత్వ రాష్ట్రీయ బాల ఆరోగ్య కార్యక్రమం ఆర్ .బి .ఎస్ .కె కింద పనిచేస్తుందని ఇక్కడ ప్రత్యేక శిశు వైద్యులు, ఫిజియోథెరపిస్టులు,చిన్నారుల మానసిక వైద్య నిపుణులు,స్పీచ్ తెరపిస్టులు, ఉంటారని ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి , అవసరమైన వారికి ఉచితంగా మందులు అందించడం జరుగుతుందన్నారు.ఈ ఇంటింటి సర్వేలో గుర్తించిన వారికి డి.ఇ.ఐ.సి సెంటర్ కు పంపిస్తున్నామన్నారు. సర్వే కార్యక్రమంలో ఏ.ఎన్.ఎం సుజాత, ఏ.ఎన్.ఎం పద్మావతి ఆశ వర్కర్లు ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.ఈనెల 10న ప్రారంభమైన సర్వే 24వ తేదీ వరకు జరుగుతుందన్నారు. సీతారాం నగర్ సర్వేలో ఏఎన్ఎం ఆర్ బుజ్జమ్మ ఆర్ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.