NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హైద‌రాబాద్ లో భారీ కుట్ర‌

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: జాహిద్ అరెస్టులో వెలుగులోకి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దసరా ఉత్సవాలను జాహిద్ అండ్ టీమ్ టార్గెట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దసరా రోజు జరిగే ఉత్సవాల్లో మూకుమ్మడి దాడులకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ సీసీఎస్, సిట్‌లో జాహిద్ అండ్ టీమ్‌పై కేసు నమోదు చేశారు. జాహిద్‌తోపాటు ఏడుగురిపై సిట్ కేసు నమోదు చేసింది. సుజి, సమియుద్దిన్, అదీల్ అఫ్రోజ్, అబ్దుల్, సోహెల్ ఖురేషి, అబ్దుల్ కలీమ్‌లపై కేసు నమోదు చేశారు. పాకిస్తాన్‌లో ఉన్న హ్యాండ్లర్స్ ద్వారా జాహిద్‌కు నిధులు అందినట్లు పోలీసులు వెల్లడించారు. టెర్రర్ దాడుల కోసం పాక్ నుంచి ఉగ్రవాదులు గ్రనేడ్స్ పంపినట్లు తెలిపారు. జన సామర్థ్యం ఉన్న ప్రాంతాల్లో మూకుమ్మడి దాడులకు కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు.

                                 

About Author