15న ఉపాధి కూలీలతో కలెక్టరెట్ ఎదుట భారీ ధర్నా
1 min read– ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం.
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : నియోజకవర్గం లో కోయిలకుంట్ల పట్టణంలో రూరల్ వాటర్ స్కీమ్ చెరువు నందు పనిచేస్తున్న ఉపాధి కూలీల దగ్గరికి ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వెళ్లి ఉపాధి సమస్యలు తెలుసుకోవడం జరిగింది .సమస్యలతో కూడిన కరపత్రం కూలీలకు పంచడం జరిగింది.ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2023 -24 బడ్జెట్ లో ఉపాధి హామీ చట్టానికి 30 వేల కోట్లు తగ్గించడం అన్యాయం అన్నారు .దీనిని బట్టి చూస్తే చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి బిజెపి ప్రభుత్వం కుట్రలు పడుతుందన్నారు .కొత్తగా పెట్టిన ఫోటో యాప్ ద్వారా కూలీలకు ఇబ్బంది కలుగుతుందన్నారు. పనిచేసిన టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఫోటో యాడ్ కాకపోతే కూలి నష్టపోవాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే మౌలిక సదుపాయాలు టెంట్ సౌకర్యం ,మజ్జిగ ,మంచినీళ్లు, రవాణా చార్జీలు ,సమ్మర్ అలవెన్స్, మెడికల్ కిట్టు ,ఓఆర్ఎస్ ప్యాకెట్లు, పారా పలుకు సానాకు అలవెన్స్ లు, బీమా సౌకర్యం లాంటి వాటన్నింటినీ ఎత్తివేయడం కూలీల కడుపు కొట్టడమే అన్నారు. దీనికోసం ఈనెల 15న రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కూలీలతోభారీధర్నానిర్వహించబోతున్నామన్నారు. పాత విధానాన్ని కొనసాగించకపోతే దేశ వ్యాప్తంగా పోరాటం చేస్తామని పిలుపునిచ్చారు. ఉపాధి కూలీలు పెద్ద ఎత్తున ఆ ధర్నాలో పాల్గొనాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రాములమ్మ, మధు, రవి ,బాలస్వామి ,మరియు ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు.