PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పది పరీక్షల్లో భారీగా తగ్గిన ఉత్తీర్ణత

1 min read

– మండల టాపర్ గా మోడల్ పాఠశాల విద్యార్థి సాయి సృజన
– ఉత్తీర్ణత తగ్గడంలో ఎవరిదీ నిర్లక్ష్యం

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండలంలో పదవ తరగతి పరీక్షల ఫలితాలలో ఉత్తీర్ణత శాతం భారీగా తగ్గింది.శనివారం మధ్యాహ్నం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతిలో పదవ తరగతి పరీక్షల ఫలితాలను ఆయన విడుదల చేశారు. మండల విద్యాశాఖ అధికారి పీ.మౌలాలి తెలిపిన వివరాల మేరకు మండలంలోని 12 పాఠశాలల్లో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులు పరీక్షలు రాశారు.మొత్తం 387 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వీరిలో 138 మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణత (35.66 శాతం)సాధించారు.అదేవిధంగా పాఠశాలల వారీగా మిడుతూరు ఏపీ మోడల్ పాఠశాలలో 95 మంది విద్యార్థులకు గాను 56 మంది విద్యార్థులు పాస్ అయ్యారు.మిడుతూరు జిల్లా పరిషత్ లో 75కుగాను 10 మంది పాసయ్యారు.తలముడిపిలో 20 మందికి గాను ముగ్గురు పాసయ్యారు.కడుమూరు జిల్లా పరిషత్ లో 47కు గాను 18 మంది,చెరుకుచెర్లలో 17 కు గాను 5 మంది,చౌటుకూరులో 25 కు గాను 7 మంది,అలగనూరులో 14 గాను ముగ్గురు,కస్తూర్బా గాంధీ పాఠశాలలో 37 కు గాను 10 మంది,కలమంద లపాడు జిల్లా పరిషత్ లో 16 గాను నలుగురు, దేవనూరులో 20 మందికి గాను 9 మంది,కడుమూరు జడ్పీ ఉర్దూలో 13 గాను 12 మంది,వీపనగండ్ల లో 8 కి గాను ఇద్దరు పాస్ అయినట్లు ఎంఈఓ మౌలాలి తెలిపారు.మిడుతూరు మోడల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి పి.సాయి సృజన 570 మార్కులతో మండల టాపర్ గా నిలిచారు.ఇదే పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు 536 నుంచి 570 మార్కుల లోపల 8 మంది విద్యార్థులు రెండవ టాపర్ గా డి.ధరణి- 552,వి.కుశల-551,పి.హమీద్ భాష-548,డి.ఆఫ్రిద్ భాష- 545,డి.భారతి 545,ఎస్ ఇర్ఫాన్ భాష-539,జె.శ్రీవల్లి- 536 ఉత్తమ ప్రతిభను కనబరిచారని పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్.సలీం భాష తెలిపారు.మండలంలోని మిగతా పాఠశాల్లో ఉత్తీర్ణత చాలా తగ్గడం పట్ల ఇలా రావడం ఉపాధ్యాయుల నిర్లక్ష్యమా లేక విద్యార్థుల నిర్లక్ష్యమా అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు అంటూ ఉన్నారు. ఇప్పటి నుంచైనా విద్యార్థులు ఏవిధంగా చదువుతున్నారనేది పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల దృష్టి సారించాలని లేకపోతే ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

About Author