వాయుగుండంగా బలహీనపడిన తుఫాన్
1 min read
పల్లెవెలుగువెబ్ : అసని తుఫాన్ కృష్ణా జిల్లా కృత్తివెన్ను దగ్గర నర్సిపట్నం-నరసాపురం మధ్య తీరం దాటిందని భారత వాతావరణశాఖ తెలిపింది. తీరందాటే సమయంలో గంటకు 55 నుంచి 65.. అప్పుడప్పుడు 75 కి.మీ. వేగంతో పెనుగాలులు వీచాయి. మచిలీపట్నం, నరసాపురం సహా పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. తీరం దాటిన తీవ్రవాయుగుండం ఉత్తర ఈశాన్యంగా యానం, కాకినాడ, తుని వరకు తీరం వెంబడి పయనిస్తూ గురువారం ఉదయానికి వాయుగుండంగా బలహీనపడిందని వాతావరణశాఖ తెలిపింది. అనంతరం కాకినాడ వద్ద సముద్రంలో కలిసే అవకాశముందని వెల్లడించింది.