హైకోర్టు సిట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ జరపాలి
1 min read– మాధవస్వామి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని .
– సిపిఐ జిల్లా నాయకులు రఘురాం మూర్తి
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు : నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం మిడుతూరు మండలంలోని వైయస్సార్ క్రాంతిపథకం కార్యాలయంలో అకౌంటెంట్ గా పనిచేస్తున్న ఉద్యోగి దేవనూరు గ్రామానికి చెందిన మాధవస్వామి ఆత్మహత్య పై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ చేపట్టి ఆత్మహత్యకు కారకులైన అధికారులను సస్పెండ్ చేసి కఠినంగా శిక్షించాలని సిపిఐ జిల్లా నాయకులు వి. రఘురాం మూర్తి ప్రభుత్వాన్నీ డిమాండ్ చేశారు.స్థానిక మిడుతూరు మండలం లోని సిపిఐ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారుల వేధింపుల వల్ల చిరుద్యోగి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమన్నారు. మృత్యుడి కుటుంబానికి కుటుంబ పోషణ కోసం 20 లక్షల ఎక్స్ గ్రేషియా అందించాలన్నారు.మృతుడి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్నీ డిమాండ్ చేశారు. అదేవిధంగా మృతుడి ఫోన్ ను పోలీస్ లు స్వాధీనం చేసుకొని విచారణ చేపట్టాలని కోరారు. మృతుడి కుటుంబానికి న్యాయం జరగనిఎడల సీపీఐ ఆధ్వర్యంలో జరగబోయే ఆందోళనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు బి. రామచంద్రుడు, వీరస్వామి ,ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎం. శ్రీనివాసులు, పట్టణ నాయకులు ఏఐఎస్ఎఫ్ తాలూకా నాయకులు వీరేంద్ర, వినోద్ తదితరులు పాల్గొన్నారు.