NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మావోయిస్టుల  ఎన్ కౌంటర్ లపై న్యాయ  విచారణ జరిపించాలి

1 min read

నంబాల  ఎన్ కౌంటరపై, ఆపరేషన్ కగార్ ఘటనల అన్నింటిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేపట్టాలి…..సిపిఐ

లేనిపక్షంలో సుప్రీంకోర్టు  సుమోటోగా స్వీకరించాలి…..డి.రాజా సాహెబ్

పత్తికొండ, న్యూస్​ నేడు :  మొన్నటి ఛత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు పలువురు మావోయిస్టుల  ఎన్ కౌంటర్ లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో  న్యాయ  విచారణ జరిపించాలని సిపిఐ మండల కార్యదర్శి డి.రాజా సాహెబ్ కేంద్ర  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే సుప్రీంకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించి న్యాయ విచారణకు ఆదేశించాలన్నారు. పత్తికొండలో చదువుల రామయ్య భవన్  నందు శుక్రవారం  పత్రిక విలేకరుల సమావేశంలో డి.రాజా సాహెబ్ మాట్లాడుతూ, నంబాల  ఎన్ కౌంటర్ పై అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయని,  ఈ వయసులో బావోయిస్టులు అడవిలో ఉన్నారా? లేదా తీసుకెళ్లి అక్కడ మట్టుపెట్టారా అనే కథనాలు వస్తున్నాయన్నారు. దీంతోపాటు గత కొంతకాలంగా జరుగుతున్న మావోయిస్టుల, ఆదివాసీల  ఎన్ కౌంటర్ల పై కూడా విచారణలో చేర్చాలని, ఆపరేషన్ కగార్ మొదలైన నాటి నుండి ఇప్పటివరకు జరిగిన విచారణ అంశంలో చేర్చాలని కోరారు.  మొన్నటి ఘటనపై ప్రధాని మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా శత్రుదేశంపై విజయం సాధించిన రీతిలో స్పందించడం విచారకరమని తెలిపారు. స్థానిక ప్రజల హక్కులు, వనరుల దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్న వారిని ఏకపక్షంగా  ఎన్ కౌంటర్ చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఇది శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యగా చూడాలని అన్నారు. 2026 మార్చి 31 వరకు నక్సలైట్లను అంతముందిస్తామని లక్ష్యంగా పెట్టుకునిమరి  ఎన్ కౌంటర్లు చేస్తుండడం, మరోపక్క తాము శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టులు మరోపక్క సమాజం ప్రకటిస్తున్నప్పట.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *