NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జ‌మ్మ‌ల‌మ‌డుగులో కీల‌క ప‌రిణామం… టీడీపీలో చేరిన దేవ‌గుడి బ్ర‌ద‌ర్స్ !

1 min read

పల్లెవెలుగు వెబ్​, కడప: క‌డ‌ప జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగు రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు దేవగుడి ఆదినారాయ‌ణ రెడ్డి సోద‌రుడు నారాయ‌ణ‌రెడ్డి టీడీపీలో చేరారు. నారాయ‌ణ రెడ్డి తో పాటు ఆయ‌న కుమారుడు భూపేష్ రెడ్డి టీడీపీ కండువా క‌ప్పుకున్నారు. పార్టీలో చేరిన వెంట‌నే భూపేష్ రెడ్డికి జ‌మ్మ‌ల మ‌డుగు టీడీపీ ఇన్చార్జీ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. దేవ‌గుడి నారాయ‌ణ‌రెడ్డి గ‌తంలో ఎమ్మెల్సీగా ప‌నిచేశారు. జ‌మ్మ‌ల‌మ‌డుగు రాజ‌కీయాల్లో దేవ‌గుడి ఫ్యామిలీ చాలా కీల‌కం. ఇటీవ‌ల టీడీపీ వీడి ఆదినారాయ‌ణ రెడ్డి బీజేపీలో చేరారు. కానీ ఆయ‌న సోద‌రుడు టీడీపీలో చేరడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే అభ్య‌ర్థి ఆదినారాయ‌ణ రెడ్డా ?.. భూపేష్ రెడ్డా ? అన్న చ‌ర్చ జ‌మ్మ‌ల‌మ‌డుగులో జ‌రుగుతోంది.

About Author