`కోడికత్తి కేసు`లో కీలక పరిణామం !
1 min readపల్లెవెలుగువెబ్ : కోడికత్తి కేసులో నాలుగేళ్లుగా రిమాండ్ ఖైదీగా ఉన్న తన కుమారుడిని విడిపించాలని కోరుతూ అతని తల్లి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాశారు. రెండు పేజీల ఆ లేఖను రిజిస్టర్ పోస్టు ద్వారా సీజేఐకి పంపించారు. నిందితుడు జనుపల్లె శ్రీనివాసరావు తల్లిదండ్రులు తాతారావు, సావిత్రి ఈ లేఖను చూపుతున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం ఠాణేలంక గ్రామానికి చెందిన తమ కుమారుడు శ్రీనివాసరావు జీవనోపాధి నిమిత్తం విశాఖ విమానాశ్రయంలోని ఫ్యూజన్ ఫుడ్ క్యాంటీన్‌లో సర్వర్ బోయ్‌గా చేరాడని ఆ లేఖలో ఆమె తెలిపారు. ‘2018 అక్టోబరు 25వ తేదీన వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి ఎయిర్‌పోర్టుకు వచ్చినప్పుడు శ్రీనివాసరావు టీ సర్వ్ చేసే క్రమంలో జేబులో ఉంచుకున్న ఫ్లవర్ డెకరేషన్‌కు ఉపయోగించే చిన్న కత్తి జగన్ భుజానికి తగిలి స్వల్ప గాయమైంది. ఎయిర్‌పోర్టు పోలీసులు ఐపీసీ సెక్షన్ 307 కింద కేసు నమోదు చేశారు.