కిలో చికెన్ రూ. 1000 !
1 min readపల్లెవెలుగువెబ్ : శ్రీలంక గత కొన్ని రోజులుగా తీవ్ర ఆహార, ఆర్థిక సంక్షోభంతో అల్లాడిపోతోంది. నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగిపోయాయి. దేశంలో ఇప్పుడు ఓ కోడిగుడ్డు రూ.35 పలుకుతుండగా, కిలో చికెన్ రూ. వెయ్యి పైమాటే. పెట్రోలు, డీజిల్, కిరోసిన్ ధరలైతే అందకుండా పోయాయి. లీటరు పెట్రోలు ప్రస్తుతం రూ. 283గా ఉండగా, డిజిల్ రూ. 220గా ఉంది. డాలర్‌తో పోలిస్తే శ్రీలంక కరెన్సీ విలువ రూ. 270కు పడిపోయింది. ఇక, కరెంటు ఊసే లేకుండా పోయింది. ఆర్థిక సంక్షోభం ముదరడంతో దేశంలోని 90 శాతం హోటళ్లు మూతపడ్డాయి.