PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పత్తికొండలో  కార్మిక సంక్షేమ కార్యాలయం ఏర్పాటు చేయాలి

1 min read

పల్లెవెలుగు: ఏఐటీయూసీ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో బుదవారం రెవిన్యూ డివిజనల్ కేంద్రంలో కార్మిక సంక్షేమ కార్యాలయం ఏర్పాటు చేయాలని స్థానిక రెవిన్యూ డివిజనల్ (ఆర్డీవో) అధికారి మోహన్ దాస్ కు  వినతిపత్రము అందజేశారు.పత్తికొండ నియోజకవర్గ పరిధిలో ఐదు మండలాలు మరియు అతి సమీపంలో దేవనకొండ, ఆస్పరి కలిసి ఏడు మండలాలు కు అనుకూలంగా రెవెన్యూ డివిజన్ కేంద్రం ఉందన్నారు.  రెవిన్యూ డివిజన్ పరిధిలో వివిధ రంగాలకు చెందిన దాదాపు 20వేల నుండి 30 వేల వరకు అసంఘటిత కార్మికులు పనిచేస్తున్నారని అన్నారు. కార్మికుల సంక్షేమం గురించి కార్యాలయంలో పనులు జరుపుకొనుటకు కార్మిక సంక్షేమ కార్యాలయం అందుబాటులో లేనందున కార్మిక వర్గానికి ఇబ్బందికరనగా మారిందన్నారు. డివిజన్ విస్తరణ పరిధిని పరిశీలించి కార్మికుల సంక్షేమ  కార్యకలాపాలునిర్వహించుకొనుటకు రెవిన్యూ డివిజన్ కేంద్రంలో ” కార్మిక సంక్షేమ కార్యాలయం”  ఏర్పాటు చేయాలని ఆర్డీవో వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ  కార్యదర్శి ఎన్. కృష్ణయ్య ఏఐటీయూసీ తాలూకా ప్రధాన కార్యదర్శి ఎం. రంగన్న  ఏ ఐ టి యు సి తాలూకా అధ్యక్షులు జి. నెట్టికంటయ్య పెయింటర్ సంఘం అధ్యక్ష కార్యదర్శులు బి .తిమ్మన్న, వై. ఆదినారాయణ, పెయింటర్స్ కార్మికులు కే. నాగరాజు, శ్రీనివాసులు, రంగన్న, బీమా ,బాలు రవికుమార్ ఆటో కార్మికులు కె. హుసేని, బి. విజయ్, ఎస్. రఫీ, ఎస్. పీరా తదితరులు పాల్గొన్నారు.

About Author