అధిక సంఖ్యలో శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న భక్తులు
1 min read
హైదరాబాద్ చెందిన మహేందర్,లత దంపతులు (డోనర్స్కీమ్)10,00,000/-రూపాయలు విరాళం
కార్య నిర్వహణాధికారిణి ఆర్.వి చందన
పల్లెవెలుగు,ఏలూరు జిల్లా ప్రతినిధి: జంగారెడ్డిగూడెం మండలము, గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయమువద్ద శనివారం సందర్భముగా ఆలయ ముఖమండపంపై స్వామివారి ఉత్సవమూర్తికి అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకం నిర్వహించారు. సదరు కార్యక్రమములలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ సిబ్బంది భక్తులకు ప్రసాదాలు అందజేశారు. ఆలయమువద్ద దాతలచే నిర్మించబడుచున్న వసతి గదులు (డోనార్స్ స్కీమ్) నకు హైదరాబాద్ కు చెందిన మహేందర్,లత దంపతులు రూ.10,00,000/-లు విరాళముగా ఇచ్చారు. ఆలయమువద్ద అధిక సంఖ్యలో భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. శ్రీస్వామివారి దర్శనముంకు విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా ఆలయ పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు పర్యవేక్షణలో తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయకార్యనిర్వహణాధికారిణి ఆర్.వి.చందన తెలిపారు.
