PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నాయకుడు అంటే ప్రజలకు సేవ చేసి ప్రజల మనసును గెలవాలి

1 min read

హోళగుంద మండల కేంద్రం నుండి మార్లమడికి వరకు బి.టి రోడ్డు నిర్మాణం కొరకు భూమి పూజ చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం..

రూ.5.34 కోట్లతో బిటి రోడ్డు ఏర్పాటుకు భూమి పూజ చేసిన కార్మిక మంత్రి గుమ్మనూరు జయరాం

రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో రాకపోకలకు ఈ బి.టి రోడ్డు వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది.

నియోజకవర్గ పరిధిలో మరో రెండు నూతన బిటి రోడ్లుకు ఏర్పాటు కసరత్తు..

రాజకీయాల్లో ఉన్నవారికి ఓర్పు,సహనం కలిగి ఉండాలి..

మండల వైస్సార్సీపీ నాయకుడు వై.కుమారస్వామి నూతన గృహ ప్రవేశకు హాజరై ప్రారంభించిన మంత్రి గుమ్మనూరు జయరాం

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ గుమ్మనూరు జయరాం

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ప్రజల రాకపోకలకు  కీలకమైన బి.టి రోడ్డును రూ 5.34 కోట్ల వ్యయం తో భూమి పూజ చేసి పనులను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ గుమ్మనూరు జయరాం ప్రారంభించారు.బుధవారము హోళగుంద మండల కేంద్రం నుండి మార్లమడికి వరకు బి. టి రోడ్డు సుమారు 5 కిలోమీటర్ల దూరం ఉన్న రోడ్డును భూమి పూజా చేసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ… ఈ యొక్క రోడ్డు పనులు పూర్తవడం ద్వారా  ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాలకు రవాణా వ్యవస్థ మెరుగుపడుతుందన్నారు. ప్రజలకు రవాణా ద్వారా మెరుగైన సేవలు అందించడం జరుగుతుందని మంత్రి వెల్లడించారు.మరియు ఆలూరు నియోజకవర్గంలో నూతన బీటీ రోడ్లకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.త్వరలో వాటికి కూడా ప్రారంభమవుతాయని అన్నారు.రోడ్డు,మరియు ప్రాధాన్య భవనాలైన గ్రామ సచివాలయం, వైయస్సార్ హెల్త్ క్లినిక్, వైయస్సార్ రైతు భరోసా కేంద్రాలు, నవరత్నాలు పేదలందరికీ ఇల్లు నిర్మాణాల వంటి శాశ్వతంగా నిలిచిపోయే పనులకు సీఎం ప్రాధాన్యత ఇచ్చారన్నారు.  రాజకీయాల్లో ఉన్నవారికి ఓర్పు, సహనం కలిగి ఉండాలని మరియు నాయకుడు అంటే ప్రజలకు సేవ చేసి ప్రజల మనసును గెలవాలన్నారు. ప్రజలకు మంచి చేస్తే వారి గుండెల్లో గుడి కడతారని మంత్రి స్థానిక నాయకులకు సూచించారు.తమ ప్రాంతానికి విచ్చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ గుమ్మనూరు జయరాంకు స్థానిక ప్రజలు సాదర స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో మంత్రి సోదరుడు గుమ్మనూరు నారాయణ స్వామి,ఆలూరు మార్కెట్ యార్డు ఛైర్మన్ గుమ్మనూరు నారాయణ, హాలహర్వి జడ్పీటీసీ లింగప్ప, జిల్లా జెడ్పీ వైస్ ఛైర్మన్ బావ శేషాప్ప,మండల ఎంపీపీ తనయుడు ఈషా,సొసైటీ ఛైర్మన్ మల్లికార్జున, ఎంపీటీసీ మల్లికార్జున,జిల్లా కార్యదర్శి రాంభీం నాయుడు,తోక వెంకటేష్,మాజీ జడ్పీటీసీ అల్లయ్యప్ప పలువురు ఎంపీటీసీ సభ్యులు,సర్పంచుల్లు వైస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Author