గేదె కన్నా సింహం ధర తక్కువ !
1 min readపల్లెవెలుగువెబ్ : పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయింది. దీంతో ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు.. జూలో ఉన్న జంతువుల ఆలనా పాలనా చూసేందుకు కూడా డబ్బులులేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో పాక్ ప్రభుత్వం సింహాలను అమ్మకానికి పెట్టినట్టు ఆ దేశ మీడియా సంస్థలు పలు కథనాల్లో తెలిపాయి. అది కూడా ఓ గేదెను కొనుగోలు చేసే ధర కన్నా తక్కువ ధరలో అంటూ పేర్కొన్నాయి. లాహోర్ సఫారీ జూలోని అధికారులు కొన్ని ఆఫ్రికన్ సింహాలను (పాక్ కరెన్సీ) రూ.150,000 కంటే తక్కువ ధరకు విక్రయించడానికి సిద్ధంగా ఉన్నట్లు అక్కడి మీడియా సంస్థ సామా టీవీ తెలిపింది. కాగా, పాకిస్తాన్‌లో ఒక గేదె ధర ఆన్‌లైన్ మార్కెట్‌లో రూ.350,000 వరకు లభిస్తుందని పేర్కొంది.