PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దీర్ఘ‌కాలం రాళ్ల స‌మ‌స్య‌ మూత్ర‌పిండాల‌ పనితీరును దెబ్బ‌తీయ‌వ‌చ్చు

1 min read

– ఇదే త‌ర‌హా వ్యాధితో సుదీర్ఘంగా బాధ‌ప‌డుతున్న వ్య‌క్తి మూత్ర‌పిండాల స‌మ‌స్య గుర్తించి చికిత్స‌తో న‌యం చేసిన ఏఐఎన్‌యూ  సికింద్రాబాద్ వైద్యులు

పల్లెవెలుగు వెబ్  హైద‌రాబాద్‌: ఏసియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాల‌జీ & యూరాల‌జీ (AINU) సికింద్రాబాద్ వైద్యులు భారీ స్థాయిలో ఉన్న రాయి కార‌ణంగా తీవ్రంగా ఉబ్బిపోయిన మూత్ర‌పిండాన్ని మినిమ‌ల్ ఇన్‌వాసివ్ లాప‌రోస్కోపిక్ విధానం ద్వారా తొల‌గించిన‌ట్లు వెల్ల‌డించారు. 68 పురుషుడు త‌న మూత్ర‌పిండాలు ఉబ్బిపోయి దీర్ఘ‌కాలంగా స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నప్ప‌టి  ఎలాంటి రోగ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేసుకోకుండా స‌మ‌స్య‌ను గుర్తించ‌కుండా ఉన్న త‌రుణంలో ఏఐఎన్‌యూ  సికింద్రాబాద్ వైద్యులు ఈ మేర‌కు శ‌స్త్రచికిత్స చేసి ప్రాణాపాయ ముప్పు త‌ప్పించారు.ఏఐఎన్‌యూ క‌న్స‌ల్టెంట్ యూరాల‌జిస్ట్ డాక్ట‌ర్ రాఘ‌వేంద్ర కుల‌క‌ర్ణి ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ, `ఈ వ్య‌క్తి మా ఆస్ప‌త్రికి విచ్చేసిన‌పుడు, ఆయ‌నకు వివిధ ర‌కాలైన స‌మ‌గ్ర ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా ఆయ‌న కుడి మూత్ర పిండంలో భారీ స్థాయిలో ఉన్న రాయి మూత్ర‌పిండానికి – మూత్రాశ‌యానికి మ‌ధ్య నిలిచిపోవ‌డం వ‌ల్ల ఆ కిడ్నీ ప‌నితీరూ పూర్తిగాదెబ్బ‌తింద‌ని నిర్ధార‌ణ అయింది. ఒక‌వేళ‌, ఈ రాయిని ఇదే విధంగా ప‌లు సంవ‌త్స‌రాల పాటు ఉండిపోయినా లేదా త‌గు చికిత్స చేయ‌క‌పోయినా దానివ‌ల్ల మూత్ర‌పిండం ప‌నితీరు పూర్తిగా దెబ్బ‌తినే ప్ర‌మాదం ఉంటుంది“ అని వెల్ల‌డించారు.  చ‌క్కెర వ్యాధి మ‌రియు ర‌క్త‌పోటు అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో దీర్ఘ‌కాలంగా బాధ‌ప‌డుతున్న ఈ రోగి సాధార‌ణ ర‌క్త‌ప‌రీక్షకు వెళ్లారు. సీరం సెర‌టైనిన్ అధిక శాతం ఉంద‌ని గ‌మ‌నించ‌డంతో, ఆల్ట్రాసోనోగ్ర‌ఫీ ప‌రీక్ష చేయించుకోగా, ఆయ‌న కుడి మూత్ర పిండం 192 x 96 మిల్లీమీట‌ర్ల మేర ఉండి క‌టి వ‌ద్ద స‌మ‌స్య‌ను ఏర్ప‌ర‌చ‌టం, పెల్వియూరెటిక్ వ‌ద్ద 19mm, మూత్ర‌పిండం వ‌ద్ద 6mm ఉంద‌ని నిర్దార‌ణ అయింది. బీఎంఐ పెద్ద ఎత్తున ఉన్నందున పొత్తిక‌డుపు ప‌రీక్ష‌లో ఎలాంటి సానుకూల స్పంద‌న రాలేదు. అనంత‌రం ఆయ‌న్ను ఏఐఎన్‌యూ సికింద్రాబాద్‌కు త‌ర‌లించారు. సిటీ స్కాన్ ప‌రీక్ష అనంత‌రం కుడి మూత్ర‌పిండంలో స‌మ‌స్య‌లు ఉండి 190 x 107 ఎంఎంమేర విస్త‌రించింద‌ని, పెల్వియూరెటిక్ జంక్ష‌న్ వ‌ద్ద‌ 22.1 x 10.7 x 13.8  ఎంఎం విస్త‌రించి మూత్ర‌పిండం మ‌రియు మూత్రాశ‌యంలో స‌మ‌స్య‌లు ఏర్ప‌డిన‌ట్లు గుర్తించారు.  99mTc DTPA Renogram ద్వారా ప‌రీక్ష నిర్వ‌హించ‌గా కుడి మూత్ర‌పిండంలో స‌మ‌స్య ఉన్న‌ట్లుగా నిర్ధార‌ణ అయింది. ఎడ‌మ మూత్ర‌పించ‌డం యొక్క జీఎఫ్ఆర్ (ml/min) 40.76గా నిర్ధార‌ణ అయింది. భారీ స్థాయిలో ఉన్న రాయి కార‌ణంగా మూత్ర‌పిండం ప‌నితీరు దెబ్బ‌తిన‌డం (Pelvi-ureteric junction calculus and hydronephrotic kidney with non-functioning kidney ) స‌మ‌స్య‌ను ముందుగానే గుర్తించి ప‌రిష్క‌రించుకునే అవ‌కాశం ఉంది. నిపుణులైన వైద్యుల‌చే ఈ స‌మ‌స్య‌కు త‌గు ప‌రిష్కారం పొంద‌వ‌చ్చు. ఈ ర‌క‌మైన అనారోగ్య స‌మ‌స్య‌ను గుర్తించ‌క‌పోవ‌డం వ‌ల్ల ఇన్ఫెక్ష‌న్‌కు దారితీయ‌డం మ‌రియు చీము చేర‌డం వంటివి జ‌ర‌గ‌డంతో పాటుగా స‌ద‌రు వ్య‌క్తి రోగ నిరోధ‌క శ‌క్తి సైతం దెబ్బ‌తింటుంది.మా ఆస్ప‌త్రికి చికిత్స కోసం వ‌చ్చిన ఈ 68 పురుషుడికి స్వ‌ల్ప మూత్ర‌పిండాల స‌మ‌స్య ఎదుర‌వ‌డంతో పాటుగా చ‌క్కెర వ్యాధి స‌మ‌స్య మ‌రియు ర‌క్త‌పోటు ఇబ్బందులు సైతం ఎదుర‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు లాప‌రోస్కోపిక్ నెఫ్రోక్ట‌మీ (5 పోర్ట్స్ /  కీహోల్స్‌). పైన పేర్కొన్న ఆరోగ్య‌ స‌మ‌స్య‌లు ఎదురైన‌ప్ప‌టికీ, ఆయ‌న కోలుకున్న విధానం అభినంద‌నీయం.ఆయా చికిత్స కేంద్రాల‌లో ఉన్న‌టువంటి అధునాత‌న ప‌రిక‌రాల ద్వారా స్వ‌ల్ప న‌ష్టంతో కిడ్నీ తొల‌గింపు అనేది వారు ఎంచుకునే ప్ర‌థ‌మ ప్రాధాన్య అంశం. అయితే ఖ‌ర్చు- ప్ర‌యోజ‌నం ప్రాతిపదిక‌న చూస్తే రొబోటిక్ విధానాలు నోడ‌ల్ కేంద్రాల‌కే ప‌రిమితం కాగా, లాప‌రోస్కోపిక్ విధానాలు విస్తృతంగా నిర్వ‌హించ‌బ‌డుతున్నాయి. మూత్ర‌పిండాల‌లో రాయి ఏర్ప‌డి దీర్ఘ‌లం అలాగే ఉండిపోయిన ప‌రిస్థితుల‌లో మూత్ర‌పిండం ప‌నితీరుపై తీవ్ర ప‌ర‌భావం ప‌డే ప్ర‌మాదం ఉంటుంది. ప్ర‌స్తుతం మా వ‌ద్ద చికిత్స పొందిన వ్య‌క్తికి ఉన్న చ‌క్కెర వ్యాధి మ‌రియు అధిక ర‌క్త‌పోటు స‌మ‌స్య‌ను అధిగ‌మ‌స్తూ సైతం ఆయ‌న మూత్ర‌పిండాల ప‌నితీరు స‌మ‌స్య‌కు ప‌రిష్కారం అందించ‌గ‌లిగిన‌ట్లు వెల్ల‌డించారు.

About Author