తప్పిన పెను ప్రమాదం ..నాణ్యత కు తిలోదకాలు
1 min read
ప్రారంభానికి ముందే కూలి ఓవర్ హెడ్ ట్యాంక్
మంత్రాలయం, న్యూస్ నేడు : అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా నాసిరకంగా ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేపట్టడంతో ప్రారంభానికి ముందే కూలిపోయింది. ఎప్పుడు ఇక్కడ పిల్లలు పెద్దలు సేదతీరేందుకు కూర్చునివారు. కానీ కూలిన సమయంలో ఎవరూ లేకపోవడంతో దీంతో పెను ప్రమాదం తప్పింది. అలాగే జగనన్న కాలనీ కి 11 కెవి విద్యుత్ సరఫరా అయ్యే లైన్ పై పడకపోవడం తో పెను ప్రమాదం తప్పింది. ఏళ్ల తరబడి నిర్మాణం చేపట్టి పూర్తి చేయకుండా వదలడం తో కూలిపోయింది. వివరాల్లోకి వెళితే నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయం లో 2017 లో అప్పటి టిడిపి ప్రభుత్వం హయాంలో రూ 25 లక్షల తో 60 వేల లీటర్ల నీటి సామర్థ్యం తో రాఘవేంద్ర పురం కాలనీలో నీటి సమస్య పరిష్కారానికి ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేపట్టారు. తూతూ మంత్రంగా నిర్మాణం పనులు చేపట్టారు. దీంతో నత్తనడకన పనులు సాగాయి. అయితే ఎట్టకేలకు పనులు పూర్తి చేసి పది రోజులుగా నీటి సరఫరా చేసి ట్రయల్స్ చూశారు. అయితే రోజు మాదిరిగానే నీటి సరఫరా చేసే సమయంలో నాసిరకంగా పనులు పూర్తి చేయడం వల్ల కూలిపోయిందని స్థానికులు చెబుతున్నారు. దేవుని దయ వల్ల అందరూ బతికి పోయామని స్థానికులు తెలిపారు. నాసిరకంగా పనులు చేసిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. పరిశీలించిన ఆర్డబ్ల్యుఎస్ ఏఈ వెంకటరాముడు :- రాఘవేంద్ర పురం కాలనీలో కూలిపోయిన ఓవర్ హెడ్ ట్యాంక్ ను ఆర్డబ్ల్యుఎస్ ఏఈ వెంకటరాముడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కువ కాలం నిర్మాణం చేపట్టి పూర్తి చేయకుండా వదలడం తో కూలిపోయిందని తెలిపారు.