సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర
1 min read– వేదవతి ప్రాజెక్టు పనులను వెంటనే పునః ప్రారంభించాలని. డిమాండ్.
పల్లెవెలుగు వెబ్ హోలంగుంద: వేదవతి ప్రాజెక్టు 8 టీఎంసీల నీటి సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మించాలని భూములు కోల్పోయిన రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం మెరుగైన నష్టపరిహారం ఇవ్వాలని నిలిచిపోయిన పనులను ప్రారంభించాలని ఆలూరు నియోజకవర్గంలో సాగునీరు త్రాగునీరు ఇవ్వాలని ప్రాజెక్ట్ పరిధిలోకి ఆస్పరి మండలాన్ని చేర్చాలని కోరుతూ సిపిఐ పాదయాత్ర.ఈ పాదయాత్రకు ముఖ్యఅతిథిగా సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బి. గిడ్డయ్య గారు జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించడం జరిగింది.ఈ పాదయాత్ర కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సిపిఐ మండల సహాయ కార్యదర్శి పెద్దహ్యాట మారెప్పఈ సందర్భంగా సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బి. గిడ్డయ్య మాట్లాడుతూ కర్నూల్ జిల్లాలోని ఆలూరు నియోజకవర్గం అత్యంత వెనుకబడిన ప్రాంతం కరువు కాటకాలకు నిలయంగా ఉంది నియోజకవర్గం లో ప్రజలు ప్రతి సంవత్సరం సుధీర ప్రాంతాలకు వలసపోయి బ్రతుకుతూ ఇబ్బందులకు. త్రాగునీటికి సైతం తుంగభద్ర దిగువ కాలువ పై ఆధారపడి ప్రజలు జీవనం చేస్తున్నారు ఆలూరు నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే వేదవతి ప్రాజెక్టు నిర్మాణమే ఏకైక శరణం నిర్మాణ పనులు త్వరగా పూర్తి అయితే *_ఆలూరు చిప్పగిరి హాలహార్వి హోళగుంద మండలాలలో 80.వేల ఎకరాలకు సాగునీరు 253 గ్రామాలకు త్రాగనీరు అందించవచ్చని నిపుణులు రూపకల్పన చేశారు.జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1942 కోళ్ల రూపాయలు అంచులతో ప్రాజెక్టు పూర్తి చేయడానికి టెండర్లు పిలిచి పనులు ఈ నాలుగు సంవత్సరాలు కాలంలో కాంట్రాక్ట్ 120 కోట్లు విలువచేసే పైప్ లైన్లను పనులు చేశారు కానీ వారికి కేవలం 16 కోట్లు మాత్రమే ప్రభుత్వం బిల్లులు చెల్లించి దీనితో అర్థరత్తంగా పనులు చేసి కాంట్రాక్టు వెళ్లిపోయారు నిధులు విడుదల చేయడంలో ప్రభుత్వం శ్రద్ధ చేయడంతో ప్రాజెక్ట్ నిర్మాణ ప్రశాంతకంగా మారింది దీని కారణంగా ఈ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుంది మరింత కరువు కాటకాలకు నిలయంగా మారే ప్రమాదం ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలానికి ఎటువంటి నీటి సౌకర్యం లేక త్రాగునీరు త్రాగునీరు లేక ప్రజలు దినదిన ఘనంగా బతుకుతున్నారు ఈ మండలానికి వేదవతి ప్రాజెక్టు ద్వారా మండలంలో అన్ని గ్రామాలకు త్రాగునీరు త్రాగునీరు అందించడానికి ప్రభుత్వం విద్య పార్టీ పథకలు చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ప్రభుత్వం పై ఇప్పటికైనా పూర్తిస్థాయిలో నిధులు కేటాయించి నిర్మాణ పనులు ప్రారంభించి పూర్తి చేయాలని ఆస్పరి మండలాన్ని ప్రాజెక్టులో పరిధిలో చేర్చాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో ఆలూరు చిప్పగిరి హాలహర్వి ఆస్పరి దేవనకొండ హోళగుంద మండలాలలో ప్రజల చేత పాదయాత్ర చేపట్టే కార్యక్రమం జరిగింది ఇంతటితో ఈ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకొచ్చి పనులు ప్రారంభించేంతవరకు సిపిఐ పార్టీ పోరాడుతామని ఈ సభాముఖంగా వారు తెలియజేశారు. ఈ పాదయాత్ర కార్యక్రమంలో హొలగుంద సిపిఐ మండల సహాయ కార్యదర్శిలు పెద్దహ్యాట మారెప్ప రంగన్న జిల్లా కౌలు రైతు కార్యదర్శి తిమ్మయ్య సీపీఐ జిల్లా సమితి సభ్యుడు భూపేష్ తాలూకా రైతు సంఘం అధ్యక్షుడు నాగేంద్ర. సిపిఐ ఆలూరు మండల కార్యదర్శి రామాంజి ఆస్పరి మండల కార్యదర్శి విరుపాక్షి. ఆలూరు మండలం రైతు సంఘం నాయకుడు హోతురప్ప ఆలూరు ఏఐటీయూసీ తాలూకా కార్యదర్శి శివ ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి సభ్యుడు శ్రీరంగ. హోలగుంద రైతు సంఘం కృష్ణ ఆలూరు ఆస్పరి హోలగుంద దేవనకొండ మండలాల సిపిఐ మండల నాయకులు వెంకన్న యూసుఫ్ నూర్ భాషా హినహిత్ తదితరులు పాల్గొన్నారు.