బోయ శ్రీరాములు పై హత్య కేసు నమోదు చేయాలి
1 min read– కర్నూలు జిల్లా కురువ సంఘం డిమాండ్.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆలూరు నియోజకవర్గo పరిధిలోని ఆస్పరి మండలం అట్టేకల్లు గ్రామంలో ఫిబ్రవరి 1వ తేదీన బోయ శ్రీరాములు (శీను)అనే వ్యక్తి బలత్కారముగా పట్టుకోవడానికి కురువ రాజేశ్వరి వాళ్ళ పొలములోనే కుటుంబ సభ్యులు పనిచేస్తుండగా ఆమెపై దుర్మార్గంగా ప్రవర్తించాడు.ఈ అవమానం భరించలేక పురుగుల మందు త్రాగి అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కర్నూలు జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోవడం జరిగింది. ఈమె మరణానికి కారణమైన బోయ శ్రీరాములు ( శీను) పై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కర్నూలు జిల్లా కురువ సంఘం జిల్లా అధ్యక్షులు పత్తికొండ శ్రీనివాసులు అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న ప్రధాన కార్యదర్శి ఎం కె రంగస్వామి,పక్కీరప్ప ,సురేంద్ర ,తవుడు శ్రీనివాసులు రామకృష్ణ తిరుపాల్ బాలరాజు దివాకర్ వేంకటేశ్వర్లు పుల్లన్న తదితరులు డిమాండ్ చేస్తున్నారు కచ్చితంగా అతనిపై హత్య కేసు నమోదు చేసి శిక్ష అమలు చేయాలని లేనిపక్షంలో జిల్లా మొత్తం రాస్తారోకోలు ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు.