ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఏ పీ డి
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: మండల పరిధిలోని చిందుకురు గ్రామంలో ఉపాధి హామీ కింద జరుగుతున్న పనులను ఏ.పీ.డి బాలాజీ నాయక్ గురువారం పరిశీలించారు . అనంతరం ఉపాధి కూలీలతో ఆయన మాట్లాడుతూ దినసరి వేతనం 272 రూపాలు పడేవిధంగా కొలతలు తీసుకొని పని చేయించాలని ఆదేశించారు . ఉద్యాన పంటల పథకం కింద ఆసక్తిగల రైతుల కు మామిడి, జామ , మునగ వంటి మొక్కలు సబ్సిడీ కింద ప్రభుత్వం ఇస్తుందని కావలసినవారు ఉపాధి హామీ కార్యాలయం నందు సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో ఏ.పీ.వో వెంకటరమణ టెక్నికల్ అసిస్టెంట్ రామోజీ నాయక్ ఫీల్డ్ అసిస్టెంట్ ఉపాధి కూలీలు పాల్గొన్నారు.