ఎ.పి. ఎన్జీవోస్ నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన ఏలూరు జిల్లా కలెక్టర్..
1 min readఉద్యోగులకు ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు..
ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు అన్ని విషయాలలో సమర్థవంతంగా పనిచేయాలి
పాలనపై ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన ఏపీఎన్జీవోస్ అధ్యక్ష, కార్యదర్శులు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఎ.పి. ఎన్జీవోస్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అసోషియేషన్ కి సంబంధించిన నూతన క్యాలెండర్ 2024 ను ఏలూరు జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ఆవిష్కరించారు. స్ధానిక కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ వారిని కలిసిన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ కార్యదర్శి నెరుసు రామారావు, మరియు ఏలూరు తాలూకా అధ్యక్షుడు గోన్నూరి శ్రీధర్ రాజు, కార్యదర్శి కప్పల. సత్యనారాయణ , జిల్లా సంఘ నాయకులు, మహిళా విభాగం చైర్ పర్సన్ కె. నాగమణి, మహిళా విభాగం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కలను అందజేశారు. అనంతరం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరు తాలూకా 2024 వార్షిక క్యాలెండర్ ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఉద్యోగుల కు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు. ఉద్యోగుల శ్రేయస్సు కోసం సంఘాలు పనిచేయాలని, వారి శ్రేయస్సుకు అన్ని వేళలా తమ సహాయ సహకారాలు ఉంటాయని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నతాధికారుల ఆదేశాలను సారం జిల్లా ప్రజలకు కావలసిన అన్ని మౌలిక సదుపాయాలలో సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్, కార్యదర్శి రామారావు జిల్లా అధికారుల పాలపై కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.