NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యార్థి సమస్యల పై మాజీ ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేత 

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండలో సోమవారం సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా రక్షణ బేరిలో భాగంగా స్థానిక అంబేద్కర్ సర్కిల్లో చేపట్టిన ప్రచార భేరిలో పాల్గొన్న సిపిఎం మాజీ కర్నూలు ఎమ్మెల్యే ఎంఏ గపోర్ కు విద్యార్థి సమస్యలపై SFI అధ్వర్యం వినతి పత్రం అందజేసింది. ప్రజారక్షణ ప్రచార బేరికి ఎస్ఎఫ్ఐ మద్దతు తెలిపుతూ, పత్తికొండ ప్రాంతంలో నెలకొన్న విద్యార్థి సమస్యలను మాజీ ఎమ్మెల్యే గఫూర్ కు వివరించారు. పత్తికొండలో ప్రభుత్వ ఐటిఐ కాలేజ్ ఏర్పాటు చేయాలని, ఏపీ మోడల్ స్కూల్ నందు టీచర్స్ కొరత తీర్చాలని,పత్తికొండలో పీజీ కాలేజ్   ఏర్పాటు చేయాలని, పబ్లిక్ టాయిలెట్ ఏర్పాటు చేయాలని, బాలికల హాస్టల్ సొంత భావనలు కేటాయించాలని, విద్యార్థులకు గ్రూప్ 2 కోచింగ్  సెంటర్లను ద్వారా విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వాలని ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆయనను కోరారు. ఈ సమస్యలు పై దాదాపుగా చాలా సంవత్సరాల నుండి SFI  విద్యార్ధి సంఘంగా ఎన్నో సార్లు ఉద్యమాలు చేపట్టిన ఎన్నో సార్లు అధికారుల కూ విన్నపించుక్కున్న సమస్య తీరలేదని అన్నారు. ఈ మేరకు మాజీ సిపిఎం ఎమ్మెల్యే ఎంఏ గపూర్ విద్యార్థులతో మాట్లాడుతూ, విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల నాయకులు మండల కార్యదర్శి వినోద్ మండల ఉపధ్యక్షులు రవి, ఎస్ఎఫ్ఐ నాయకులు ఈరన్న తదితరులు పాల్గొన్నారు.

About Author